Pawan Kalyan: ఏపీ వ్యాప్తంగా పవన్ బస్సు యాత్ర.. ప్రత్యేక బస్సు రెడీ.. పేరు ఏంటంటే..
ABN , First Publish Date - 2022-12-07T17:16:13+05:30 IST
2024 అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో (Assembly General elections) విజయం సాధించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు.
అమరావతి: 2024 అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో (Assembly General elections) విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. ఇందులో సమాయత్తంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక బస్సును సిద్ధం చేయించుకున్నారు. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరు పెట్టారు.
ఈ మేరకు పవన్ కల్యాన్ ట్విటర్ వేదికగా బస్సు ఫొటలోను షేర్ చేశారు. ఎన్నికల యుద్ధానికి 'వారాహి' బస్సు సిద్ధమంటూ (Varahi bus) వీడియో, ఫొటోలను పంచుకున్నారు. కాగా ఈ బస్సు .. మిలిటరీ వాహనాన్ని పోలివుండడం ఆసక్తిని కలిగిస్తోంది. రంగు కూడా ఆర్మీ వాహన కలర్‌కు దగ్గరిగా ఉంది. ఈ వాహనానికి పవన్ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వాహనంపై ఎలాంటి నంబర్ కనిపించలేదు. దీంతో ఆర్టీఏ ఈ వాహనానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.