Nellore.. యుద్ధం మొదలైంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-12-31T12:32:55+05:30 IST

నెల్లూరు: జగన్‌రెడ్డి (Jaganreddy) పాలనలో రాష్ట్రం కోలుకోలేని పరిస్థితికి వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు.

Nellore.. యుద్ధం మొదలైంది: చంద్రబాబు

నెల్లూరు: జగన్‌రెడ్డి (Jaganreddy) పాలనలో రాష్ట్రం కోలుకోలేని పరిస్థితికి వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శనివా

రం నెల్లూరులో మాట్లాడుతూ తన 40 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా పిల్లలను కూడా తీసుకువచ్చి, వారి మెడలో టీడీపీ (TDP) జెండాలు వేస్తున్నారని, భయం వల్ల చాలా మంది బయటకి రావడం లేదన్నారు. రానురాను తిరుగుబాటు ఇంకా ఇంకా పెరుగుతుందని, పోరాటం చేయకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందన్నారు. పోరాటం చేస్తామని, ప్రజలూ ముందుకు రావాలని పిలుపిచ్చారు. అయిదుకోట్ల జనం ఒకపక్కన, జగన్ మరో వైపున యుద్ధం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇండియా (India)కి డిజిటల్ (Digital), డెమొక్రటిక్ (Democratic) అని సీజే (CJ) అన్నారని, నాలెడ్జ్ ఎకానమీ ఇప్పుడు చూసేదానికంటే విభిన్నంగా ఉంటాయని చంద్రబాబు అన్నారు. బిగినింగ్ ఆఫ్ ఇన్ఫినిటీలో ఉన్నామని, ఇరవై అయిదేళ్లలో ప్రపంచంలో పెనుమార్పులు వస్తాయని, ఏపీ అధఃపాతాళానికి పోతుందన్నారు. ప్రజలు స్వచ్చంధంగా ముందుకొచ్చారని, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి కార్యక్రమాలను ప్రజలు లింక్ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ (CM Jagan) నిజంగా సైకో (Psycho) అని.. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసేశారని చంద్రబాబు విమర్శించారు. 2023 పెనుమార్పులకు వేదిక కానుందని, వైసీపీలో కూడా విభేదాలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రంపై గౌరవం ఉండేవారు ఆ పార్టీలో ఉండరన్నారు. స్థానిక సంస్థల వ్యవస్థలను నిర్విర్యం చేశారని, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు ఆ పార్టీలో ఎందుకు ఉండాలన్నారు. జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2022-12-31T12:32:59+05:30 IST