Chandrababu: చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం...

ABN , First Publish Date - 2022-12-31T11:41:25+05:30 IST

నెల్లూరు జిల్లా: జగన్మోహన్ రెడ్డి సైకో పాలనతో రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా లేరని, చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు.

 Chandrababu: చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం...

నెల్లూరు (Nellore): జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) సైకో (Psycho) పాలనతో రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా లేరని, చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫైర్ (Fire) అయ్యారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శనివారం నెల్లూరులో మాట్లాడుతూ ధరల భారంతో ప్రజలు అవస్తలుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మారకపోతే ఇంటికి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

దేశంలోనే సంపన్న సీఎం జగన్‌రెడ్డని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మంత్రులకూ బాధ్యత ఉంటుందని, సైకోలను ప్రజలే కట్టడి చేసే పరిస్థితి వస్తుందన్నారు. సబ్‌ప్లాన్ నిధులను సీఎం జగన్ పక్కదారి పట్టించారని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్నా ముఖ్యమంత్రికి బాధ లేదని చంద్రబాబు దుయ్యబట్టారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నీ విధ్వంస సంవత్సరాలేనని, జగన్ విధ్వంస పాలనకు ప్రజలు బాధ అనుభవిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెడుతున్నారని, పోలీసుల అండ చూసుకుని వైసీపీ గూండాలు, సైకోలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. మేం బాధపడుతుంటే జగన్, వైసీపీ నేతలు ఆనందపడుతున్నారన్నారు. విచారణ పేరుతో సీఐడీ వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. జగన్ పాలనలో అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ స్నేచ్ఛ కోల్పోయారన్నారు. ప్రజలు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు.

దేశంలో ఎక్కడా లేని ధరలు ఏపీలో ఉన్నాయని, రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని చంద్రబాబు అన్నారు. ఏపీలో మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందని, జగన్‌ మాత్రం అవినీతిలో నెంబర్‌ వన్‌గా నిలిచారని అన్నారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా విస్తరించిందని, మత్తు పదార్థాల నివారణకు సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-12-31T11:41:29+05:30 IST