AP News: హెల్త్ యూనివర్సిటీపై ఎన్టీఆర్ పేరు తొలగింపు
ABN , First Publish Date - 2022-11-02T10:02:17+05:30 IST
హెల్త్ యూనివర్సిటీ పై ఉన్న ఎన్టీఆర్ పేరును వర్సిటీ అధికారులు తొలగించారు.
విజయవాడ: హెల్త్ యూనివర్సిటీ (Health university)పై ఉన్న ఎన్టీఆర్(NTR) పేరును వర్సిటీ అధికారులు తొలగించారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ (YSR) పేరును అధికారులు ఏర్పాటు చేశారు. మెయిన్ గేట్ వద్ద ఉన్న యూనివర్సిటీ హోలోగ్రామ్‌లో కూడా పేరును మార్చేశారు. కాగా... హెల్త్ యూనివర్సిటీ లోపల ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇప్పటి వరకు అధికారులు యధావిధిగా వచ్చారు. ఎన్టీఆర్ విగ్రహం కూడా తొలగించి వైఎస్ఆర్ విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తారని అధికారులు చెబుతున్నారు.