Raghurama: అందుకే పెద్ద ఎత్తున్న ప్రజలు చంద్రబాబు సభకు వస్తున్నారు..

ABN , First Publish Date - 2022-12-29T15:44:52+05:30 IST

కందుకూరు (Kandukuru) ఘటన అందరిని కలిచివేసిందని, 8 మంది చనిపోవడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.

Raghurama: అందుకే పెద్ద ఎత్తున్న ప్రజలు చంద్రబాబు సభకు వస్తున్నారు..

ఢిల్లీ: కందుకూరు (Kandukuru) ఘటన అందరిని కలిచివేసిందని, 8 మంది చనిపోవడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రధాని మోదీ (PM Modi) సానుభూతి తెలిపి పరిహారం ప్రకటించారన్నారు. ఏపీ సీఎం జగన్ (CM Jagan) ఆలస్యంగానైనా పరిహారం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూల సురేష్ (Minister Suresh) తల్లి చనిపోతే జగన్ వెళ్లారు, దానికి వందలమంది ప్రజలు వచ్చారని, అక్కడ భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. జగన్ పాదయాత్ర చేస్తే గత ప్రభుత్వం పోలీ

సు బందోబస్తు ఏర్పాటు చేసిందని.. ఇక్కడ చంద్రబాబు (Chandrababu) సభ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు. కందుకూరు ఘటనపై సాక్షిలో ఇష్టానుసారంగా రాశారని, జగన్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజాదరణ పెరుగుతోందని, అందుకే పెద్ద ఎత్తున్న ప్రజలు ఆయన సభకు వస్తున్నారని పేర్కొన్నారు. మెయిన్ రోడ్ కూడలిలో చంద్రబాబు సమావేశం పెట్టుకోవచ్చు కదా అని సాక్షిలో రాశారని, మెయిన్ రోడ్‌లో పెడితే పోలీసులు అనుమతి ఇవ్వరు కదా అని రఘురామ అన్నారు.

Updated Date - 2022-12-29T15:44:56+05:30 IST