High court: ఏపీ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2022-11-11T14:45:19+05:30 IST
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

అమరావతి: రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై ప్రభుత్వాని (AP Government)కి హైకోర్టు (Highcourt)లో ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలోని 17 గ్రామాల్లో రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రామసభలు నిర్వహించకుండా వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడాన్ని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. రైతుల తరపున హైకోర్టు లో శుక్రవారం లంచ్ మోషన్ పిటీషన్‌లు దాఖలయ్యాయి. మందడం, లింగాయపాలెం గ్రామాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామసభలను నిర్వహించింది. అదే విధంగా మిగతా 17 గ్రామాల్లో రెండు రోజుల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read more