AP News: కడపలో హర్యానా దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2022-12-15T09:38:07+05:30 IST

జిల్లాలోని బాలాజీ నగర్‌లో హర్యానా దొంగలు బీభత్సం సృష్టించారు.

AP News: కడపలో హర్యానా దొంగల బీభత్సం

కర్నూలు: జిల్లాలోని బాలాజీ నగర్‌లో హర్యానా దొంగలు బీభత్సం సృష్టించారు. మంగళవారం అర్ధరాత్రి దొంగలు ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. అయితే గస్తీ నిర్వహిస్తున్న పోలీసులను చూసి దొంగలు పారిపోయారు. దొంగల కంటైనర్‌ను హోంగార్డు రవి, పోలీసులు వెంబడించగా... వారిపై దొంగలు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వాటి నుంచి తప్పించుకొని హోంగార్డు రవి దొంగల్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఇద్దరు హర్యానా దొంగలు తాహిర్, ముస్తఫాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2022-12-15T09:38:08+05:30 IST