Devineni Uma: అధికారంలోకి వస్తే వారికి యూనిట్ విద్యుత్ రూ. 1.50లకే

ABN , First Publish Date - 2022-11-26T20:36:42+05:30 IST

ఉమ్మడి నెల్లూరు: టీడీపీ(TDP) అధికారంలోకి రాగానే ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ అనే తేడా లేకుండా యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే ఇస్తామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) చెప్పారు. టీడీపీ (TDP) నేతలు గూడూరులో

Devineni Uma: అధికారంలోకి వస్తే వారికి యూనిట్ విద్యుత్ రూ. 1.50లకే

ఉమ్మడి నెల్లూరు: టీడీపీ(TDP) అధికారంలోకి రాగానే ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ అనే తేడా లేకుండా యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే ఇస్తామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) చెప్పారు. టీడీపీ (TDP) నేతలు గూడూరులో ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఆక్వా రైతులకి మద్దతుగా జాతీయ రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి కాకాణి ఆక్వా రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం జగన్ ఆక్వా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే ఇస్తామని చెప్పారు. విజిలెన్స్, స్టేట్ జీఎస్ట్, టాస్క్‌ఫోర్స్, పొల్యూషన్ తనిఖీ వంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

Updated Date - 2022-11-26T20:36:43+05:30 IST