Lokesh : రోడ్లపై గుంతలు పూడ్చలేరు కానీ.. పేదల ఇళ్లయితే కూల్చేస్తారు

ABN , First Publish Date - 2022-11-05T05:14:53+05:30 IST

రోడ్లపై గుంతలను పూడ్చలేని ప్రభుత్వం రోడ్ల విస్తరణ పేరుతో పేదల నివాసాలను కూల్చివేయడం చాల విడ్డూరంగా ఉందని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Lokesh : రోడ్లపై గుంతలు పూడ్చలేరు కానీ.. పేదల ఇళ్లయితే కూల్చేస్తారు

మంగళగిరి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : రోడ్లపై గుంతలను పూడ్చలేని ప్రభుత్వం రోడ్ల విస్తరణ పేరుతో పేదల నివాసాలను కూల్చివేయడం చాల విడ్డూరంగా ఉందని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ‘జగన్‌ జేసీబీలు పేదలు తమ రెక్కల కష్టంతో కట్టుకున్న ఇళ్లను నేలమట్టం చేస్తున్నాయ్‌. మంగళగిరి నియోజకవర్గంలో సీఎం ఇంటిపక్క ఉన్న పేదల నివాసాల కూల్చివేతతో మొదలైన విధ్వంసం నియోజకవర్గమంతటా విశృంఖలంగా సాగుతోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇళ్లను కూల్చివేయించడం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓ వ్యసనంలా మారింది. ఇప్పటంలో ఇళ్లను కూల్చడం అనాగరిక చర్య’ అని లోకేశ్‌ అన్నారు.

Updated Date - 2022-11-05T05:14:55+05:30 IST