AP News: శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

ABN , First Publish Date - 2022-11-01T09:26:16+05:30 IST

శబరి ఎక్స్‌ప్రెస్‌‌కు పెను ప్రమాదం తప్పింది.

AP News: శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

గుంటూరు: శబరి ఎక్స్‌ప్రెస్‌‌ (Sabari Express train)కు పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని కంకరగుంట గేటు సమీపంలో రైల్వేట్రాక్‌పై కొందరు దుండగులు అడ్డంగా ఇనుప రాడ్డును కట్టారు. ముందుగా గుర్తించిన సిబ్బంది శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపివేసి రాడ్డును తొలగించారు. కాగా.. రాడ్డును అడ్డంగా కట్టడంపై రైల్వే పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు సెక్షన్ 154, 174సి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-11-01T09:46:15+05:30 IST