AP News: బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు పనులకు మళ్లీ బ్రేక్
ABN , First Publish Date - 2022-12-31T11:30:20+05:30 IST
అమరావతి రోడ్డులో బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు పనులకు మళ్లీ బ్రేక్ పడింది.
గుంటూరు: అమరావతి రోడ్డులో బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు పనులకు మళ్లీ బ్రేక్ పడింది. పనులు మొదలుపెట్టిన రోజే టౌన్‌ప్లానింగ్ అధికారులు అడ్డుకున్నారు. మండల్ విగ్రహ ఏర్పాటుకు ఇప్పటికే కౌన్సిల్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే అనుమతులు లేవంటూ పనిచేస్తున్న ప్రొక్లెయిన్‌ను టౌన్ ప్లానింగ్ అధికారి ఆపేశారు. దీంతో విగ్రహ నిర్మాణ ప్రదేశం వద్ద బీసీ సంఘాలు ఆందోళనకు దిగారు.