Nakka Ananda Babu: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు నష్టపోయారు
ABN , First Publish Date - 2022-12-13T12:22:30+05:30 IST
నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు(Nakka Ananda Babu) తెలిపారు. మాండస్
బాపట్ల జిల్లా: నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు(Nakka Ananda Babu) తెలిపారు. మాండస్ తుఫాన్ ప్రభావంతో చుండూరు, అమృతలూరు మండలాల్లో నీట మునిగిన పంట పొలాలను నక్కా ఆనంద బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా తుఫానులతో నష్ట పోతున్నామని.. ప్రభుత్వం ఆదుకోవడం లేదని రైతన్నలు ఆవేదన చెందారు. ఈ మూడున్నరేళ్లలో మంత్రి మేరుగ నాగార్జున(Minister Meruga Nagarjuna) ఆలపాడు వైపు కన్నెత్తి కూడా చూడలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆనంద బాబు కామెంట్స్..
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు పంట నష్టపోతున్నారని నక్కా ఆనంద బాబు ఆరోపించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు జగన్ రెడ్డి పాలనలో లేవని విమర్శించారు. అసలు రైతులను, వ్యవసాయాన్ని పట్టించుకునే నాధుడే లేడని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. చేతలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ దాటడం లేదని వ్యాఖ్యానించారు.