AP News: గ్రామ చెరువులో భారీ చేప... ఆశ్చర్యంలో ప్రజలు

ABN , First Publish Date - 2022-11-22T11:19:00+05:30 IST

సముద్రాల్లో భారీ చేపలను చూస్తూనే ఉంటాం.. అదే గ్రామ చెరువులో అలాంటి చేప కనిపిస్తే....

AP News: గ్రామ చెరువులో భారీ చేప... ఆశ్చర్యంలో ప్రజలు

గుంటూరు: సముద్రాల్లో భారీ చేపలను చూస్తూనే ఉంటాం.. అదే గ్రామ చెరువులో అలాంటి చేప కనిపిస్తే....ఇంకేముంది దాన్ని చూసేందుకు జనం ఎగబడటం ఖాయం. ఇలాంటే ఘటనే జిల్లాలో చోటు చేసుకుంది. ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామ చెరువులో భారీ చేప వచ్చి చేరింది. సముద్రపు సీయోనుగా ప్రజలు భావిస్తున్నారు. గ్రామ చెరువులో సముద్ర భారీ చేప ఉండటంపై ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సముద్ర భారీ చేపను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు. యనమదల గ్రామానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు.

Updated Date - 2022-11-22T11:19:02+05:30 IST