AP News: చిత్తూరులో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2022-12-15T10:56:40+05:30 IST
జిల్లాలోని కుప్పం మండలం చందం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
చిత్తూరు: జిల్లాలోని కుప్పం మండలం చందం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం తమిళనాడు రాష్ట్రం తిరుపత్తురు నుంచి కుప్పం వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన నలుగురు ప్రయాణికులను కుప్పం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.