Rain: తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం

ABN , First Publish Date - 2022-12-25T20:23:21+05:30 IST

తిరుమల (Tirumala)లో ఆదివారం ఎడతెరిపిలేని వర్షం (Rain) కురిసింది. వేకువజాము నుంచే మొదలైన వర్షం రాత్రి వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉంది.

 Rain: తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం

తిరుమల: తిరుమల (Tirumala)లో ఆదివారం ఎడతెరిపిలేని వర్షం (Rain) కురిసింది. వేకువజాము నుంచే మొదలైన వర్షం రాత్రి వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉంది. దీంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు (Devotees) వర్షం ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో, దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన సందర్భంలో వర్షాంలో తడుస్తూనే వెళ్లారు. శ్రీవారి ఆలయం మొదలుకొని మాడవీధులు, కాటేజీలు, బస్టాండ్‌, రోడ్లు, పార్కులు వంటి ప్రాంతాలు వర్షంలో తడిచి ముద్దయ్యాయి. ఇకా, సందర్శనీయ ప్రదేశాలైన శ్రీవారి పాదాలు, శిలాతోరణం, పాపవినాశనం, వేణుగోపాల స్వామి ఆలయం, జపాలి, ఆకాశగంగ భక్తుల్లేక వెలవెలబోయాయి. చిరుజల్లులు కురుస్తూనే ఉన్న క్రమంలో దర్శనం పూర్తయిన భక్తులు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. మరోవైపు ఆదివారం కావడంతో తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. గదులు లభించిన భక్తులు వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఘాట్లలో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ద్విచక్రవాహనదాలు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు పొగమంచు కమ్మేయడంతో తిరుమల కొండపై చలితీవ్రత కూడా పెరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు అవస్థ పడ్డారు.

Updated Date - 2022-12-25T20:23:23+05:30 IST