Jagan: సీఎం జగన్పై పవన్కల్యాణ్ సెటైర్లు
ABN , First Publish Date - 2022-12-15T19:56:56+05:30 IST
ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై (CM Jagan) జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawankalyan) సెటైర్లు వేశారు.
అమరావతి: ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై (CM Jagan) జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawankalyan) సెటైర్లు వేశారు. మంత్రుల భేటీలో జగన్ వ్యాఖ్యలపై ఆయన వ్యంగ్యాస్త్రంగా మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడ్డాయి, మంత్రులు అవినీతికి దూరంగా ఉండండి.. అంటూ జగన్ చెబుతున్న కార్టూన్ను పవన్ పోస్ట్ చేశారు. అవినీతికి కరప్షన్ హాలిడే ప్రకటించడం ప్రశంసనీయం అంటూ ట్వీట్టర్ వేదికగా స్పందించారు.
కాగా ‘మంత్రులంతా అవినీతికి దూరంగా ఉండండి. ఎలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించండి’ అని సీఎం జగన్ మంత్రులకు స్పష్టం చేసినట్లుగా... ‘వచ్చే 13, 16 నెలల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో మీపై మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మంత్రులుగా మీపై ఆరోపణలు వస్తే అవి ప్రభుత్వంపై ప్రభావం చూపుతాయి’ అని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా అవినీతిపై మంత్రులతో సీఎం కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.