అందుకే వైసీపీ సభ అట్టర్ ఫ్లాప్ అయింది: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2022-12-07T14:53:32+05:30 IST
బీసీలకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న (Buddha Venkanna పేర్కొన్నారు.
అమరావతి: బీసీలకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న (Buddha Venkanna పేర్కొన్నారు. బీసీల బతుకులను జగన్ (Jagan) చట్టబద్ధంగా నాశనం చేశారని మండిపడ్డారు. బీసీల జీవితాలను జగన్ కాళ్ల దగ్గర తాకట్టుపెడుతున్న మంత్రులను తరిమికొట్టాలన్నారు. చంద్రబాబు (Chandrababu) రోడ్డుషోకు ప్రజా స్పందన చూసే వరకూ.. జగన్‌రెడ్డికి బీసీ (BC)లు గుర్తుకు రాలేదన్నారు. ప్రజలకు ఏదైనా చేస్తే బీసీలకు పదవులిచ్చినట్లు.. నలుగురికి పదవులిస్తే బీసీలకు మేలు చేసినట్లు కాదని వ్యాఖ్యానించారు. బీసీలను చంద్రబాబుకు దూరం చేయాలనే కుట్రతో వైసీపీ (YCP) పెట్టిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు.