మృత్యుతీగకు నలుగురు బలి

ABN , First Publish Date - 2022-11-03T03:40:12+05:30 IST

అనంతలో కూలీల ట్రాక్టర్‌పై తెగిపడ్డ వైరు కోతలు కోసి వెనుదిరిగిన కూలీలు ట్రాక్టర్‌ ఎక్కుతుండగా తెగిన విద్యుత్‌తీగ ఆ సమయంలో అక్కడ 30 మంది కూలీలు క్యాబిన్‌లోకి ఎక్కిన నలుగురూ మృత్యువాత ఇద్దరి పరిస్థితి విషమం.. మృతుల్లో అత్తాకోడళ్లు పొలంలో కిందివరకు వేలాడుతున్న తీగలు తీగల బరువుకు వంగిపోయిన క్రాస్‌ పోల్‌ పదేళ్లుగా వాటిని అలాగే వదిలేసిన వైనం సకాలంలో పట్టించుకోక కూలీలు బలి కిందిస్థాయిలో నలుగురు సిబ్బందిపై వేటు 10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌ విడపనకల్లు, నవంబరు2: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గా హొన్నూరు గ్రామంలో బుధవారం పెను విషాదం చోటుచేసుకుంది. కోతలు కోసి వెనక్కితిరిగిన కూలీలను తీసుకెళ్లడానికి సిద్ధమైన ట్రాక్టర్‌ క్యాబిన్‌పై విద్యుత్‌ వైరు తెగిపడి, వారిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మిగతా 12వ పేజీలో... మృత్యుతీగకు నలుగురు బలి (మొదటి పేజీ తరువాయి) అత్తాకోడళ్లు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే...దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన కే సుబ్బయ్య పొలంలో ఆముదం పంటను కోసేందుకు 30 మంది కూలీలు ఉదయం ట్రాక్టర్‌లో వెళ్లారు. సాయంత్రం మూడు గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. రైతు సుబ్బయ్యకు చెందిన ట్రాక్టర్‌లో తొలుత ఎనిమిది మంది కూలీలు ఎక్కారు. ఆ సమయంలో ట్రాక్టర్‌పై ఉన్న 11 కేవీ విద్యుత్‌ వైరు తెగి, వారిపై పడింది. ట్రాక్టర్‌లోకి ఎక్కి కూర్చున్న నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. ట్రాక్టర్‌ ట్రాలీ, క్యాబిన్‌ మధ్యలో ఉన్న నలుగురిలో ఇద్దరు కిందకు దూకి తప్పించుకున్నారు. మరో ఇద్దరు దూకే యత్నంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మిగిలిన కూలీలు అప్రమత్తమై భయాందోళనతో దూరంగా పరుగులుతీశారు. రైతు, బాధిత కూలీల కథనం ప్రకారం.. మిగతావారు వచ్చేలోపు ట్రాక్టర్‌లో స్థలం చూసుకుని ముందుగా కూర్చుందామని కొందరు కూలీలు భావించడమే ప్రాణాలపైకి తెచ్చింది. ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో కూలీలు అందరూ సిద్ధమౌతుండగా ఒక్కొక్కరుగా ట్రాక్టర్‌ వద్దకు బయల్దేరారు. ముందుగా వచ్చిన ఎనిమిది మంది మహిళలు ట్రాక్టర్‌ క్యాబిన్‌లోకి చేరారు. స్థలం చూసుకుని కూర్చోబోతుండగా, పైన ఉన్న విద్యుత్‌ తీగ ట్రాక్టర్‌పై పడింది. అప్పటికి క్యాబిన్‌లో సర్దుకుని కూర్చున్న నలుగురు విద్యుదాఘాతానికి బలయ్యారు. అది గమనించిన ట్రాక్టర్‌ డ్రైవరు, మరి కొందరు దూరంగా పరుగులు తీశారు. ట్రాక్టర్‌ వద్దకు వస్తున్న ఇతర కూలీలను అప్రమత్తం చేశారు. ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించి, విద్యుత్‌ సరఫరాను ఆపేశారు. మరో ట్రాక్టర్‌ తెప్పించి, మృతదేహాలను ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. మృతులను వన్నక్క (50), రత్నమ్మ (30), వారిద్దరి బంధువు సరోజమ్మ అలియాస్‌ శంకరమ్మ (35) పార్వతి (35)గా గుర్తించారు. వీరిలో వన్నక్క, రత్నమ్మ అత్తాకోడళ్లు. గాయపడిన సుంకమ్మ, ఆదెమ్మను బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, వన్నక్కకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమారుడి భార్య రత్నమ్మ కూడా ఈ ప్రమాదంలో మరణించింది. రత్నమ్మకు ఇద్దరు చొప్పున కుమార్తెలు, కుమారులు ఉన్నారు. పార్వతికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. సరోజమ్మకు కూతురు, కుమారుడు ఉన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. కాగా, అనంతపురం ఘటనపై సీఎం జగన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇందులో విద్యుత్‌శాఖ నుంచి రూ.ఐదులక్షలు, సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ. ఐదు లక్షలు ఒక్కో బాధిత కుటుంబానికి అందిస్తామని తెలిపారు. ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశించామని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతో్‌షరావు చెప్పారు. దీనికోసం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ డీవీ చలపతి నేతృత్వంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ గురవయ్య, అనంతపురం విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డితో కమిటీని ఆయన నియమించారు. విధి నిర్వహణలో ట్రాన్స్‌కో కల్యాణదుర్గం డీఈ మల్లికార్జునరావు, బొమ్మనహాళ్‌ ఏఈ ఎంకే లక్ష్మీరెడ్డి, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ హమీదుల్లా బేగ్‌, దర్గాహొన్నూరు లైన్‌మన్‌ బసవరాజు నిర్లక్ష్యం వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, వారిని సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. వేలాడుతున్నా పట్టించుకోలేదు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గాహొన్నూరులో పదేళ్ల క్రితం విద్యుత్‌ లైన్‌ లాగారు. విద్యుత్‌ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో వైర్లు కిందకు వేలాడుతున్నాయి. క్రాస్‌ పోల్‌ కూడా వంగిపోయింది. అయినా.. అధికారులు స్పందించి తీగలను సరిచేయలేదు. సకాలంలో కదలని విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి కూలీలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సమగ్ర విచారణ జరపాలి: చంద్రబాబు అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతానికి గురై కూలీలు మృతి చెందటం అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారం రోజుల వ్యవధిలో విద్యుత్‌ తీగలతో ప్రమాదం జరగడం ఇది రెండోసారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మరో ప్రకటనలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరో ప్రకటనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌... ‘‘రాష్ట్రంలో వరుసగా విద్యుత్‌ తీగలు ఎందుకు తెగిపడుతున్నాయి. ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎవరు? ఆ పనులు ఇప్పించిన ప్రభుత్వ పెద్దలు ఎవరు? తీగ లాగితే తాడేపల్లి డొంక కదులుతుంది’’ అని అన్నారు. మృతి చెందిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షల, గాయపడిన వారికి రూ.2 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. తీగలు నాసి.. ప్రాణాలు మసి ప్రాణాలు తోడేస్తున్న డిస్కమ్‌ల హంతక నిర్లక్ష్యం నేతల ఒత్తిడితో నాసిరకం పరికరాల కొనుగోలు ప్రాణాలుపోతే ఉడత ఊపిందని నిస్సిగ్గు జవాబు ‘తీగ’ కదులుతుందని దర్యాప్తునకూ దూరమే తీగలు నాసి.. ప్రాణాలు మసి (అమరావతి, ఆంధ్రజ్యోతి) ప్రమాదాలు జరిగే సమయంలో ప్రభుత్వాలు అప్రమత్తమవుతాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిపై లోతైన విచారణను, దర్యాప్తును చేపడతాయి. కానీ, వరుస ధుర్ఘటనలు జరుగుతున్నా... యఽథావిధిగా ప్రభుత్వం నుంచి చలనమే లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగి.. నివేదికలు బయటకువస్తే, అధికార పెద్దల ‘తీగలు’ కదులుతాయని, నాసిరకం పరికరాల కాంట్రాక్టు గుట్టు రట్టు అవుతుందని పలువురు ఘాటుగా విమర్శిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌లో కూలీలు ఎక్కిన ట్రాక్టర్‌పై 33కేవీ విద్యుత్తు తీగ తెగిపడి వారిని బలితీసుకొన్న ఘటన.. డిస్కమ్‌ల నిర్లిప్త, నిర్లక్ష్య వైఖరిని మరోసారి బోనులో నిలబెట్టింది. అయితే, ఈ జిల్లాలో ఈ తరహా మరణాలు కొత్త కాదు. ఈ ఏడాది జూలై 30వ తేదీన సత్యసాయిజిల్లాలో (ఉమ్మడి అనంతపురం) ఆటోపై విద్యుత్తు తీగలు తెగిపడి ఐదుగురు మరణించారు. ఆ వెంటనే ఎస్పీడీసీఎల్‌ దర్యాప్తును చేపడితే విద్యుత్తుతీగల బిగింపులో లోపాలు బయటపడేవి. కానీ, డిస్కమ్‌లు కదలనేలేదు. డిస్కమ్‌లు సేకరిస్తున్న విద్యుత్తు తీగలు .. ఇతర పరికరాలలో నాణ్యతా ప్రమాణాలు ఉండటం లేదన్న ఆరోపణలు మొదటినుంచీ వినిపిస్తున్నాయి. అత్యంత ప్రమాదభరితమైన ఈ పరికరాల విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, రాజకీయనేతల సిఫారసులకు లొంగి నాణ్యతలేని పరికరాలు కొనుగోలుచేయడం వల్లే వరుస విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిసిప్తున్నాయి. ఉడత ఊపులకే.. ఈ ఏడాది జూలై 30న శ్రీసత్యసాయిజిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద వేరుశెనగ చేనులో కలుపు తీసేందుకు కూలీలు రెండు ఆటోల్లో బయలుదేరారు. ఈ క్రమం విద్యుత్‌స్తంభం నుంచి తీగ తెగి ఒక ఆటోపై పడింది. ఐదుగురిని బలిగొంది. ఈ ఘటనకు ఉడుతఊపే కారణమంటూ అప్పట్లో ఎస్పీడీసీఎల్‌ సీఎండీ నిసిగ్గుగా వెల్లడించారు. ఉడుత ఊపులకే విద్యుత్తు తీగలు పడిపోతాయా అని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అధికారులు బదులివ్వలేక మౌనం దాల్చారు.

మృత్యుతీగకు నలుగురు బలి

అనంతలో కూలీల ట్రాక్టర్‌పై తెగిపడ్డ వైరు

కోతలు కోసి వెనుదిరిగిన కూలీలు

ట్రాక్టర్‌ ఎక్కుతుండగా తెగిన విద్యుత్‌తీగ

ఆ సమయంలో అక్కడ 30 మంది కూలీలు

క్యాబిన్‌లోకి ఎక్కిన నలుగురూ మృత్యువాత

ఇద్దరి పరిస్థితి విషమం.. మృతుల్లో అత్తాకోడళ్లు

పొలంలో కిందివరకు వేలాడుతున్న తీగలు

తీగల బరువుకు వంగిపోయిన క్రాస్‌ పోల్‌

పదేళ్లుగా వాటిని అలాగే వదిలేసిన వైనం

సకాలంలో పట్టించుకోక కూలీలు బలి

కిందిస్థాయిలో నలుగురు సిబ్బందిపై వేటు

10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌

విడపనకల్లు, నవంబరు2: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గా హొన్నూరు గ్రామంలో బుధవారం పెను విషాదం చోటుచేసుకుంది. కోతలు కోసి వెనక్కితిరిగిన కూలీలను తీసుకెళ్లడానికి సిద్ధమైన ట్రాక్టర్‌ క్యాబిన్‌పై విద్యుత్‌ వైరు తెగిపడి, వారిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే...దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన కే సుబ్బయ్య పొలంలో ఆముదం పంటను కోసేందుకు 30 మంది కూలీలు ఉదయం ట్రాక్టర్‌లో వెళ్లారు. సాయంత్రం మూడు గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. రైతు సుబ్బయ్యకు చెందిన ట్రాక్టర్‌లో తొలుత ఎనిమిది మంది కూలీలు ఎక్కారు. ఆ సమయంలో ట్రాక్టర్‌పై ఉన్న 11 కేవీ విద్యుత్‌ వైరు తెగి, వారిపై పడింది. ట్రాక్టర్‌లోకి ఎక్కి కూర్చున్న నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. ట్రాక్టర్‌ ట్రాలీ, క్యాబిన్‌ మధ్యలో ఉన్న నలుగురిలో ఇద్దరు కిందకు దూకి తప్పించుకున్నారు. మరో ఇద్దరు దూకే యత్నంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మిగిలిన కూలీలు అప్రమత్తమై భయాందోళనతో దూరంగా పరుగులుతీశారు. రైతు, బాధిత కూలీల కథనం ప్రకారం.. మిగతావారు వచ్చేలోపు ట్రాక్టర్‌లో స్థలం చూసుకుని ముందుగా కూర్చుందామని కొందరు కూలీలు భావించడమే ప్రాణాలపైకి తెచ్చింది.

ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో కూలీలు అందరూ సిద్ధమౌతుండగా ఒక్కొక్కరుగా ట్రాక్టర్‌ వద్దకు బయల్దేరారు. ముందుగా వచ్చిన ఎనిమిది మంది మహిళలు ట్రాక్టర్‌ క్యాబిన్‌లోకి చేరారు. స్థలం చూసుకుని కూర్చోబోతుండగా, పైన ఉన్న విద్యుత్‌ తీగ ట్రాక్టర్‌పై పడింది. అప్పటికి క్యాబిన్‌లో సర్దుకుని కూర్చున్న నలుగురు విద్యుదాఘాతానికి బలయ్యారు. అది గమనించిన ట్రాక్టర్‌ డ్రైవరు, మరి కొందరు దూరంగా పరుగులు తీశారు. ట్రాక్టర్‌ వద్దకు వస్తున్న ఇతర కూలీలను అప్రమత్తం చేశారు. ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించి, విద్యుత్‌ సరఫరాను ఆపేశారు. మరో ట్రాక్టర్‌ తెప్పించి, మృతదేహాలను ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. మృతులను వన్నక్క (50), రత్నమ్మ (30), వారిద్దరి బంధువు సరోజమ్మ అలియాస్‌ శంకరమ్మ (35) పార్వతి (35)గా గుర్తించారు. వీరిలో వన్నక్క, రత్నమ్మ అత్తాకోడళ్లు. గాయపడిన సుంకమ్మ, ఆదెమ్మను బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా, వన్నక్కకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమారుడి భార్య రత్నమ్మ కూడా ఈ ప్రమాదంలో మరణించింది. రత్నమ్మకు ఇద్దరు చొప్పున కుమార్తెలు, కుమారులు ఉన్నారు. పార్వతికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. సరోజమ్మకు కూతురు, కుమారుడు ఉన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. కాగా, అనంతపురం ఘటనపై సీఎం జగన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇందులో విద్యుత్‌శాఖ నుంచి రూ.ఐదులక్షలు, సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ. ఐదు లక్షలు ఒక్కో బాధిత కుటుంబానికి అందిస్తామని తెలిపారు. ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశించామని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతో్‌షరావు చెప్పారు. దీనికోసం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ డీవీ చలపతి నేతృత్వంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ గురవయ్య, అనంతపురం విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డితో కమిటీని ఆయన నియమించారు. విధి నిర్వహణలో ట్రాన్స్‌కో కల్యాణదుర్గం డీఈ మల్లికార్జునరావు, బొమ్మనహాళ్‌ ఏఈ ఎంకే లక్ష్మీరెడ్డి, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ హమీదుల్లా బేగ్‌, దర్గాహొన్నూరు లైన్‌మన్‌ బసవరాజు నిర్లక్ష్యం వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, వారిని సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు.

వేలాడుతున్నా పట్టించుకోలేదు

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గాహొన్నూరులో పదేళ్ల క్రితం విద్యుత్‌ లైన్‌ లాగారు. విద్యుత్‌ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో వైర్లు కిందకు వేలాడుతున్నాయి. క్రాస్‌ పోల్‌ కూడా వంగిపోయింది. అయినా.. అధికారులు స్పందించి తీగలను సరిచేయలేదు. సకాలంలో కదలని విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి కూలీలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

సమగ్ర విచారణ జరపాలి: చంద్రబాబు

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతానికి గురై కూలీలు మృతి చెందటం అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారం రోజుల వ్యవధిలో విద్యుత్‌ తీగలతో ప్రమాదం జరగడం ఇది రెండోసారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మరో ప్రకటనలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరో ప్రకటనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌... ‘‘రాష్ట్రంలో వరుసగా విద్యుత్‌ తీగలు ఎందుకు తెగిపడుతున్నాయి. ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎవరు? ఆ పనులు ఇప్పించిన ప్రభుత్వ పెద్దలు ఎవరు? తీగ లాగితే తాడేపల్లి డొంక కదులుతుంది’’ అని అన్నారు. మృతి చెందిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షల, గాయపడిన వారికి రూ.2 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

తీగలు నాసి.. ప్రాణాలు మసి

ప్రాణాలు తోడేస్తున్న డిస్కమ్‌ల హంతక నిర్లక్ష్యం

నేతల ఒత్తిడితో నాసిరకం పరికరాల కొనుగోలు

ప్రాణాలుపోతే ఉడత ఊపిందని నిస్సిగ్గు జవాబు

‘తీగ’ కదులుతుందని దర్యాప్తునకూ దూరమే

ప్రమాదాలు జరిగే సమయంలో ప్రభుత్వాలు అప్రమత్తమవుతాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిపై లోతైన విచారణను, దర్యాప్తును చేపడతాయి. కానీ, వరుస ధుర్ఘటనలు జరుగుతున్నా... యఽథావిధిగా ప్రభుత్వం నుంచి చలనమే లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగి.. నివేదికలు బయటకువస్తే, అధికార పెద్దల ‘తీగలు’ కదులుతాయని, నాసిరకం పరికరాల కాంట్రాక్టు గుట్టు రట్టు అవుతుందని పలువురు ఘాటుగా విమర్శిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌లో కూలీలు ఎక్కిన ట్రాక్టర్‌పై 33కేవీ విద్యుత్తు తీగ తెగిపడి వారిని బలితీసుకొన్న ఘటన.. డిస్కమ్‌ల నిర్లిప్త, నిర్లక్ష్య వైఖరిని మరోసారి బోనులో నిలబెట్టింది. అయితే, ఈ జిల్లాలో ఈ తరహా మరణాలు కొత్త కాదు. ఈ ఏడాది జూలై 30వ తేదీన సత్యసాయిజిల్లాలో (ఉమ్మడి అనంతపురం) ఆటోపై విద్యుత్తు తీగలు తెగిపడి ఐదుగురు మరణించారు. ఆ వెంటనే ఎస్పీడీసీఎల్‌ దర్యాప్తును చేపడితే విద్యుత్తుతీగల బిగింపులో లోపాలు బయటపడేవి. కానీ, డిస్కమ్‌లు కదలనేలేదు. డిస్కమ్‌లు సేకరిస్తున్న విద్యుత్తు తీగలు .. ఇతర పరికరాలలో నాణ్యతా ప్రమాణాలు ఉండటం లేదన్న ఆరోపణలు మొదటినుంచీ వినిపిస్తున్నాయి. అత్యంత ప్రమాదభరితమైన ఈ పరికరాల విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, రాజకీయనేతల సిఫారసులకు లొంగి నాణ్యతలేని పరికరాలు కొనుగోలుచేయడం వల్లే వరుస విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిసిప్తున్నాయి.

ఉడత ఊపులకే..

ఈ ఏడాది జూలై 30న శ్రీసత్యసాయిజిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద వేరుశెనగ చేనులో కలుపు తీసేందుకు కూలీలు రెండు ఆటోల్లో బయలుదేరారు. ఈ క్రమం విద్యుత్‌స్తంభం నుంచి తీగ తెగి ఒక ఆటోపై పడింది. ఐదుగురిని బలిగొంది. ఈ ఘటనకు ఉడుతఊపే కారణమంటూ అప్పట్లో ఎస్పీడీసీఎల్‌ సీఎండీ నిసిగ్గుగా వెల్లడించారు. ఉడుత ఊపులకే విద్యుత్తు తీగలు పడిపోతాయా అని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అధికారులు బదులివ్వలేక మౌనం దాల్చారు.

Updated Date - 2022-11-03T06:13:19+05:30 IST
Read more