ABN Effect : 111 విల్లాలు Seize.. మరో 49 విల్లాల నిర్మాణ పనులు నిలుపుదల..
ABN , First Publish Date - 2021-12-30T15:43:10+05:30 IST
111 విల్లాలు Seize.. మరో 49 విల్లాల నిర్మాణ పనులు నిలుపుదల..

హైదరాబాద్ సిటీ/దుండిగల్ : మల్లంపేట్‌లో శ్రీనివాస లక్ష్మీ కన్స్ట్రక్షన్స్లో ఇప్పటి వరకు 260 విల్లాలను అక్రమంగా నిర్మించినట్టు అధికారులు భావిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం 211 విల్లాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ‘విల్లా.. చర్యలెలా..?’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం బుధవారం 111 విల్లాలను సీజ్ చేసింది. మరో 49 విల్లాల నిర్మాణ పనులను నిలిపివేయించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. అలాగే, బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో నిర్మించిన ఏడు విల్లాలను కూడా సీజ్ చేసినట్లు కమిషనర్ భోగీశ్వర్లు తెలిపారు.