Share News

Secunderabad: సికింద్రాబాద్‏లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం..

ABN , Publish Date - May 08 , 2024 | 11:50 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, నిర్వహించిన సంక్షేమ పథకాలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్‌(Thiegulla Padma Rao Goud) అన్నారు.

Secunderabad: సికింద్రాబాద్‏లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం..

- సికింద్రాబాద్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌

సికింద్రాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, నిర్వహించిన సంక్షేమ పథకాలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్‌(Thiegulla Padma Rao Goud) అన్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్‌, భోలక్‌పూర్‌, జీవై.కంపౌండ్‌, బోయగూడ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌, బీజేపీ విధానాల పట్ల ప్రజలు ఏవగించుకుంటున్నారని పద్మారావు పేర్కొన్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్ ను గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారని పద్మారావు పేర్కొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌ మాట్లాడుతూ.. కేంద్ర మం త్రి, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ద్వారా ప్రజలకు కలిగిన లాభమే లేదని విమర్శించారు. ఎంపీగా పద్మారావు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి: PM Modi: రాజన్నకు ప్రధాని మోదీ కోడె మొక్కు

పద్మారావుగౌడ్‌ను గెలిపించాలి

బౌద్ధనగర్‌: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్‌ను ఎన్నికల్లో గెలిపించాలని ఆ పార్టీ యువ నాయకుడు తీగుళ్ల కిరణ్‌కుమార్‌గౌడ్‌, బౌద్ధనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ కందిశైలజ బుధవారం బౌద్ధనగర్‌ డివిజన్లో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

చిలకలగూడ: పార్టమెంట్‌లో తెలంగాణ బాణి వినిపించాలంటే కారు గుర్తుకు ఓటు వేసి పద్మారావు గౌడ్‌ను గెలిపించాలని మెట్టుగూడ కార్పొరేటర్‌ రాసూరి సునీత ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. డివిజన్‌ పరిధిలోని ఆయిల్‌ డిపో, రైల్వే క్వార్టర్స్‌ తదితదిర ప్రాంతాల్లో డివిజన్‌ అధ్యక్షుడు ఎ.ఆర్‌.కృష్ణ, కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మోత్కుపల్లి.. కాదు ఉసరవెల్లి!

Read Latest Telangana News and National News

Read Latest National News and Telugu News

ది

Updated Date - May 08 , 2024 | 11:50 AM