Share News

MVS Reddy: ‘కోడ్‌’ ముగిశాక మెట్రో రెండో దశ డీపీఆర్‌..

ABN , Publish Date - May 04 , 2024 | 11:12 AM

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి(Hyderabad Metro Rail MD NVS Reddy) అన్నారు.

MVS Reddy: ‘కోడ్‌’ ముగిశాక మెట్రో రెండో దశ డీపీఆర్‌..

- ఈ నెల 2 వరకు 54 కోట్ల మంది ప్రయాణాలు: ఎంవీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ: లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి(Hyderabad Metro Rail MD NVS Reddy) అన్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రారంభమైన 2017 నవంబర్‌ 28 నుంచి ఈనెల 2 వరకు 54 కోట్ల మంది ప్రయాణించారని, తద్వారా వివిధ వాహనాల్లో 14.05 కోట్ల లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ను ఆదా చేశామని చెప్పారు.

ఇదికూడా చదవండి: ‘గాడిద గుడ్డు’ పాలనే

గత ఫిబ్రవరి 2 వరకు 50 కోట్ల మంది ప్రయాణికుల మైలురాయి చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో ఉత్సవాలు నిర్వహించారు. తరచుగా మెట్రోలో ప్రయాణించే వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు ఆ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘గ్రీన్‌ మైల్‌ రాయల్టీ క్లబ్‌’ను ఎన్వీఎస్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రైవేట్‌-పబ్లిక్‌ భాగస్వామ్యంతో నడిచే ఏకైక మెట్రో రైలు హైదరాబాద్‌(Hyderabad)లో మాత్రమే ఉందన్నారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలను కలుపుతూ మెట్రోను నడపాలని సీఎం సూచించారని, ఆ మేరకు మెట్రోను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదికూడా చదవండి: GHMC: 18 నుంచి పనులు బంద్‌..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News


Updated Date - May 04 , 2024 | 11:12 AM