Share News

MLA: హాస్యాస్పదంగా ఆరు గ్యారెంటీల అమలు..

ABN , Publish Date - May 04 , 2024 | 11:51 AM

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఐదు హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆ పార్టీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Sanatnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు.

MLA: హాస్యాస్పదంగా ఆరు గ్యారెంటీల అమలు..

- సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఐదు హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆ పార్టీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Sanatnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం అమీర్‌పేట డివిజన్‌లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా సుప్రబాత్‌ నగర్‌లో బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. బీజేజేఆర్‌ నగర్‌, రేణుకనగర్‌, బల్కంపేట, బీజేజేఆర్‌ నగర్‌-2లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా తలసాని, పద్మారావుగౌడ్‌కు మంగళహారతులతో మహిళలు ఘన స్వాగతం పలికి శాలువలు కప్పి సన్మానించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మొదలైన హోం ఓటింగ్‌.. మొదటి రోజు నగరంలో ఇంటి వద్దే ఓటేసిన 177 మంది

పేద, మధ్య తరగతి ప్రజల పక్షాన నిలిచే బీఆర్‌ఎస్‌ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని, కారు గుర్తుకు ఓటువేసి పద్మారావు గౌడ్‌(Padmarao Goud)ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే తలసాని, పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రజలకు ఏం చేశామో వివరిస్తూ ఓట్లు అడిగే ధైర్యం తమకు ఉందని, ఈ విషయంమై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులకు ఉందా అని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి వెంకట్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ శేషుకుమారి, డివిజన్‌ అధ్యక్షులు హన్మంతరావు, బాల్‌రెడ్డి, నాయకులు అశోక్‌ యాదవ్‌, ప్రవీణ్‌ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, నర్సింహ, గులాబ్‌ సింగ్‌, లలితా గోపిలాల్‌ చౌహాన్‌, క్రిష్ణ కిరణ్‌ గౌడ్‌(కిట్టు) పాల్గొన్నారు.

ఇధికూడా చదవండి: Danam Nagender: మంగళసూత్రం విలువ మోదీకేం తెలుసు..?

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 04 , 2024 | 11:51 AM