Share News

Rain Alert: రోళ్లు పగిలే ఎండలో చల్లటి కబురు.. హైదరాబాద్‌ వాసులు ఊపిరి పీల్చుకోండి

ABN , Publish Date - Apr 29 , 2024 | 08:18 AM

భాగ్యనగర(Hyderabad Rains) వాసులకు కాస్తంత ఉపశమనం ఇచ్చే చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఇవాళ(ఏప్రిల్ 29) హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

Rain Alert: రోళ్లు పగిలే ఎండలో చల్లటి కబురు.. హైదరాబాద్‌ వాసులు ఊపిరి పీల్చుకోండి

హైదరాబాద్: అసలే వేసవి కాలం.. బయట ఎండలు ఎలా మండిపోతున్నాయో తెలిసిందే. అడుగు బయటపెట్టాలంటే జంకే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో చెట్టు చేమ ఉంటాయి కాబట్టి సమస్యేమీ ఉండకపోవచ్చు. కానీ హైదరాబాద్‌లో.. అసలే కాంక్రీట్ జంగల్ రోడ్డుపై వెళ్లాలన్న సెగలు కక్కుతూ సూరీడు మనల్నే టార్గెట్ చేస్తాడు.

ఇలాంటి సమయంలో భాగ్యనగర(Hyderabad Rains) వాసులకు కాస్తంత ఉపశమనం ఇచ్చే చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఇవాళ(ఏప్రిల్ 29) హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీంతో ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించనుంది.


తెలంగాణ వ్యాప్తంగా..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కరీంనగర్‌లో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నవేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 14 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీలకు పడిపోవచ్చు. అయితే అన్ని జిల్లాలకు వర్ష సూచన లేదని తెలుస్తోంది.

RSS: రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు: భాగవత్

ఆదివారం జగిత్యాల, ములుగు, నల్గొండ, కరీంనగర్‌లలో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చార్మినార్ వద్ద అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. నగరంలోని బహదూర్‌పురా, షేక్‌పేట్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, బండ్లగూడ, సైదాబాద్, మారేడ్‌పల్లిలో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 29 , 2024 | 09:11 AM