Share News

Weather Report: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. నేడు, రేపు జాగ్రత్త

ABN , Publish Date - May 08 , 2024 | 08:05 AM

అకాల వర్షంతో చిగురుటాకుల వణికిన తెలంగాణ జిల్లాలకు భారత వాతావరణ శాఖ(IMD) అధికారులు మరో హెచ్చరిక జారీ చేశారు. మే 8, 9 తేదీల్లో కూడా వేర్వేరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Telangana Rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Weather Report: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. నేడు, రేపు జాగ్రత్త

హైదరాబాద్: అకాల వర్షంతో చిగురుటాకుల వణికిన తెలంగాణ జిల్లాలకు భారత వాతావరణ శాఖ(IMD) అధికారులు మరో హెచ్చరిక జారీ చేశారు. మే 8, 9 తేదీల్లో కూడా వేర్వేరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Telangana Rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో 30-40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ, వరంగల్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం ఒక్క రోజే హైదరాబాద్ సహా తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.


హైదరాబాద్‌లో..

రెండేరెండు గంటల్లో... మియాపూర్‌లో 13.3 సెం.మీ, కూకట్‌పల్లిలో 11.2 సెం.మీ, చందానగర్‌లో 10.7 సెం.మీ, యూసు్‌ఫగూడలో 9.4 సెం.మీ, ఆర్సీపురం 8.8సెం.మీ వర్షపాతం నమోదైంది. నిన్న పొద్దున మండే ఎండలో కార్యాలయాలకు వెళ్లిన ఉద్యోగులు, సాయంత్రం ఇళ్లకు వెళుతూ వర్ష బీభత్సానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. జోరువానకు క్షణాల్లో రోడ్ల మీద మోకాలిలోతులో నీళ్లు చేరాయి.

రాజ్‌భవన్‌ రోడ్డు, సచివాలయం ఎదుట, బేగంపేట నుంచి ఖైరతాబాద్‌ ముద్రణాలయం వద్ద భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ప్రత్యేకించి ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. భారీగా చేరిన వరద నీరు, పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్ల మధ్య పూర్తిగా తడిసిపోయిన స్థితిలో రోడ్లపై ముందుకూ వెనక్కు వెళ్లలేక గోస పడ్డారు. వరద ఉధృతికి బాచుపల్లిలో పార్కింగ్‌ చేసిన కార్లు మునిగిపోయాయి.


వర్షానికి బీభత్సమైన గాలి తోడవడంతో చెట్లు కూలి రోడ్ల మీదపడ్డాయి. అమీర్‌పేట, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, బాలానగర్‌ తదితర చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎప్పుడో సాయంత్రం ఐదింటికి ఇళ్లకు చేరాల్సిన వాహనదారుల్లో ఎక్కువ మంది 9 గంటలకు ఇళ్లకు చేరారంటే ట్రాఫిక్‌ ఏ స్థాయిలో నిలిచిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. గోడకూలి ఏడుగురి మృతి.. జేసీబీలతో మృతదేహాలు వెలికితీత

పలుచోట్ల 4గంటల పాటు విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. గాలివాన మెట్రోనూ వణికించింది. అధికారుల ఆదేశాల మేరకు 20-30 నిమిషాల పాటు మెట్రో రైళ్లను నిలిపివేశారు. మంగళవారం కొంత మేర ఉష్ణోగ్రతలు తగ్గినా వనపర్తి జిల్లా కేతేపల్లిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2024 | 08:24 AM