Share News

TS News: హైదరాబాద్‌లో దారుణం.. ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై..

ABN , Publish Date - May 10 , 2024 | 10:25 AM

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగానికని వచ్చిన యువతిపై ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన అమీర్‌పేట్‌లో చోటు చేసుకుంది. జాబ్ ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఇంటర్వ్యూ కు వచ్చిన యువతిని సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్.. సెలెక్ట్ అయ్యావని చెప్పింది.

TS News: హైదరాబాద్‌లో దారుణం.. ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై..

హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగానికని వచ్చిన యువతిపై ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన అమీర్‌పేట్‌లో చోటు చేసుకుంది. జాబ్ ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఇంటర్వ్యూ కు వచ్చిన యువతిని సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్.. సెలెక్ట్ అయ్యావని చెప్పింది. దీంతో ఆఫీసు సిమ్ కార్డ్ ఇచ్చే సాకుతో సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్ ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి వచ్చిన యువతిపై కామాంధుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. నిందితుడు నవీన్ కుమార్‌ను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇదికూడా చదవండి: KCR: నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర

Read Latest Telangana News and National News

Updated Date - May 10 , 2024 | 10:25 AM