Share News

Viral Video: ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. లారీ టైర్లు జంటగా ఎలా వెళ్లిపోయాయో చూడండి..!

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:49 PM

జాతీయ రహదారులపై వాహనాలు (Vehicles) చాలా వేగంగా ప్రయణిస్తాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద ట్రక్కులు (Trucks) రాష్ట్రాలు దాటి ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ రోజులు ప్రయాణించే సమయంలో ఆ ట్రక్కులు, వాటి పార్ట్‌లు దెబ్బతింటాయి. ముఖ్యంగా టైర్ల విషయంలో సమస్య ఎదురవుతుంది.

Viral Video: ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. లారీ టైర్లు జంటగా ఎలా వెళ్లిపోయాయో చూడండి..!
Truck Tyres

జాతీయ రహదారులపై వాహనాలు (Vehicles) చాలా వేగంగా ప్రయణిస్తాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద ట్రక్కులు (Trucks) రాష్ట్రాలు దాటి ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ రోజులు ప్రయాణించే సమయంలో ఆ ట్రక్కులు, వాటి పార్ట్‌లు దెబ్బతింటాయి. ముఖ్యంగా టైర్ల విషయంలో సమస్య ఎదురవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ట్రక్కు నుంచి విడిపోయిన రెండు టైర్లు (Truck Tyres) చాలా దూరం ప్రయాణించాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


bestieworld అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ భారీ ట్రక్కు రోడ్డుపై వెళ్తోంది. ఉన్నట్టుండి ఆ ట్రక్కుకు చెందిన రెండు టైర్లు విడిపోయి బయటకు వచ్చేశాయి. రెండూ కలిసి జంటగా ప్రయాణిస్తూ ట్రక్కు కంటే ముందుకు వెళ్లిపోయాయి. చాలా దూరం ప్రయాణించిన ఆ రెండు టైర్లు తర్వాత రోడ్డు పక్కన పడిపోయాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ట్రక్కును వేగాన్ని తగ్గించాడు. కారులో వెళ్తున్న వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 6.6 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ప్రేమ పక్షులు రెండూ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాయి``, ``ఈ రెండూ ఎప్పటి నుంచో కలిసి ప్రయాణిస్తున్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Bryan Johnson: 46 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాడో చూడండి.. మీరు కూడా అలా మారడానికి ఎంత ఖర్చు పెట్టాలంటే..


Viral Video: ఓర్నీ.. మెడలో దండ ఎవరైనా ఇలా వేస్తారా? వధువు మీదకు దూకిన వరుడు.. ఫన్నీ వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2024 | 12:49 PM