Share News

Viral: కూతురి బెడ్రూమ్ నుంచి వింత శబ్దాలు.. తల్లిదండ్రులు చెక్ చేస్తే బయటపడిన షాకింగ్ విషయం..!

ABN , Publish Date - May 03 , 2024 | 11:22 AM

అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఓ కుటుంబానికి వింత అనుభవం ఎదురైంది. నార్త్ కరోలినా ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కొద్ది రోజులుగా ఆ కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలికకు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి.

Viral: కూతురి బెడ్రూమ్ నుంచి వింత శబ్దాలు.. తల్లిదండ్రులు చెక్ చేస్తే బయటపడిన షాకింగ్ విషయం..!
Bedroom

అమెరికా (America)లోని నార్త్ కరోలినాకు చెందిన ఓ కుటుంబానికి వింత అనుభవం ఎదురైంది. నార్త్ కరోలినా ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కొద్ది రోజులుగా ఆ కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలికకు (Girl) వింత శబ్దాలు (Strange sounds) వినిపిస్తున్నాయి. ``అమ్మా.. నా రూమ్‌లో దెయ్యం ఉంది. వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి`` అంటూ తల్లికి బాలిక ఫిర్యాదు చేసింది. అయితే ఎక్కువగా దెయ్యాల సినిమాలు చూసే బాలిక అనవసరంగా భయపడుతోందని భావించిన తల్లి పెద్దగా పట్టించుకోలేదు (Viral News).


భయం పోగొట్టేందుకు కూతురికి ఏవో మాటలు చెప్పి నిద్రపుచ్చేది. అయినా ఆ బాలిక తనకు వినిపిస్తున్న శబ్దాల గురించి చెబుతుండడంతో తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకున్నారు. గదిలోని అణువణువూ క్షుణ్నంగా పరిశీలించారు. ఒకచోట వారికి ఏవో కొన్ని తేనెటీగలు (Honey bees) కనిపించాయి. వెంటనే తేనెటీగలు పట్టే వ్యక్తిని పిలిపించారు. ఆ వ్యక్తి థెర్మల్ కెమేరాతో గోడను పరిశీలించగా షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ గోడ లోపల ఏకంగా 60 వేలకు పైగా తేనెటీగలు కనిపించాయి.


అంతకు ముందెప్పుడూ అన్ని తేనెటీగలను చూడకపోవడంతో ఆ బీ-కీపర్ కూడా షాకయ్యాడు. గోడకు ఉన్న చిన్న రంధ్రం గుండా తేనెటీగలు లోపలకి వెళుతున్నట్టు తెలుసుకున్నాడు. ఆ ఇంటిని ఖాళీ చేయించి గొడను పగలగొట్టాడు. 60 వేలకు పైగా తేనె టీగలను, 45 కేజీలకు పైగా తేనెను వెలికి తీశాడు. కాగా, ఆ తేనెటీగల వల్ల ఆ ఇంటికి రూ.15 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లకు టెస్ట్.. పరీక్షలో కాపీ కొడుతున్న విద్యార్థి ఎవరో 5 సెకెన్లలో కనిపెట్టండి!


Kim Jong Un: ఏడాదికి 25 మంది అందమైన కన్యలతో కిమ్ జాంగ్ ఉన్‌కు ‘ప్లెజర్ స్క్వాడ్’


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2024 | 11:22 AM