Share News

Isha Arora: ఎవరీ ఓవర్‌నైట్‌ స్టార్‌ ఇషా.. మేడమ్‌ను మెచ్చుకోవాల్సిందే..!

ABN , Publish Date - Apr 20 , 2024 | 04:58 PM

పోలింగ్ విధులను నిబద్ధతతో నిర్వహించిన పోలింగ్ అధికారి ఇషా అరోరా వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. వృత్తి పట్ల ఆమె కనబరిచిన శ్రద్ధ కారణంగా జనాలు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Isha Arora: ఎవరీ ఓవర్‌నైట్‌ స్టార్‌ ఇషా.. మేడమ్‌ను మెచ్చుకోవాల్సిందే..!

ఇంటర్నెట్ డెస్క్: పోలింగ్ విధులను నిబద్ధతతో నిర్వహించిన పోలింగ్ అధికారి ఇషా అరోరా వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. వృత్తి పట్ల ఆమె కనబరిచిన శ్రద్ధ కారణంగా జనాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో, ఇషా అరోరా ఎవరా అని అనేక మంది నెట్టింట సెర్చ్ (Viral) చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ మీడియా కూడా ఇషాను పలకరించింది.

Viral: దుబాయ్‌లో జలప్రళయం రేంజ్ ఇదా? ఒళ్లుగగుర్పొడిచే 30 సెకెన్ల వీడియో..!


1.jpg

ఎవరీ ఇషా అరోరా?

ఇషా అరోరా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. ఆమెకు కేటాయించిన ఎన్నికల విధుల్లో భాగంగా సహారన్‌పూర్ లోక్‌సభ పరిధిలోని మదారీ ప్రాంతంలో పోలింగ్ బ్యాధతలు నిర్వహించారు. ఒక్కసారిగా వైరల్‌గా మారిన ఇషాను జాతీయ మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన వైరల్ గురించి తెలుసునని అన్నారు. అయితే, విధుల్లో బిజీగా ఉండటంతో ఇప్పటివరకూ ఆ వీడియోను తాను చూడలేదని చెప్పుకొచ్చారు.

‘‘ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నా నిబద్ధతతో ఉండాలి. సమయపాలన పాటించాలి. అందుకే నేను టైంకు విధులకు హాజరవుతాను. వ్యవస్థలేవైనా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పనిచేయాలంటే స్త్రీపురుషులు సమయపాలన పాటించాలి. లేకపోతే.. భారీ ఎన్నికల క్రతువును నిర్వహించడం సాధ్యం కాదు. నా సమయపాలన, వృత్తిపై నిబద్ధత కారణంగా వీడియో అంతగా వైరల్ అయ్యింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక వీడియోపై జనాలు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పోలింగ్ స్టార్ ఈమే అంటూ అత్యధికమంది అభిప్రాయపడ్డారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 05:39 PM