Share News

Viral: ఏఐ ఇంత దారుణం చేసిందా? ఉద్యోగార్థికి భారీ షాక్!

ABN , Publish Date - Apr 20 , 2024 | 04:04 PM

ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థికి భారీ షాక్ తగిలింది. దరఖాస్తు చేసుకున్న మూడో నిమిషంలోనే అతడి అప్లికేషన్‌ను సంస్థ తిరస్కరించింది.

Viral: ఏఐ ఇంత దారుణం చేసిందా? ఉద్యోగార్థికి భారీ షాక్!
Man Claims His Job Application Rejected by AI Bot

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థికి భారీ షాక్ తగిలింది. దరఖాస్తు చేసుకున్న మూడో నిమిషంలోనే అతడి అప్లికేషన్‌ను సంస్థ తిరస్కరించింది. దీంతో, తన గోడు నెట్టింట వెళ్లబోసుకున్న అతడు.. ఇదంతా ఏఐ ఆధారిత బాట్ చేసిందంటూ చెప్పాడు. నెట్టింట వైరల్‌గా (Viral) మారిన ఈ ఉదంతం అనేక మందిని కలవర పెడుతోంది.

Viral: దుబాయ్‌లో జలప్రళయం రేంజ్ ఇదా? ఒళ్లుగగుర్పొడిచే 30 సెకెన్ల వీడియో..!

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి నేషనల్ గ్రిడ్‌లో జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కొన్ని గంటల పాటు శ్రమపడి అప్లికేషన్, కవర్ లెటర్ సిద్ధం చేసినట్టు అతడు తెలిపాడు. తన అప్లికేషన్‌ను తొలుత ఈమెయిల్ చేసినప్పుడు వెంటనే రిప్లై వచ్చిందని చెప్పాడు. అప్లికేషన్‌ను పరిశీలిస్తున్నామని, మరో 14 రోజుల్లో సమాధానం ఇస్తామని ఈమెయిల్‌లో ఉందని చెప్పాడు. ఆ తరువాత మరో మూడు నిమిషాలకే రెండో ఈమెయిల్‌ వచ్చిందని, తన అప్లికేషన్‌ను తిరస్కరించినట్టు అందులో ఉందని చెప్పుకొచ్చాడు. తన దరఖాస్తును కచ్చితంగా ఏఐ బాట్ తిరస్కరించి ఉంటుందంటూ ప్రముఖ చర్చా వేదిక రెడిట్‌లో అతడు చెప్పుకొచ్చాడు (Job Applicant Gets Rejection Mail In 3 Minutes, Claims A Bot Taking The Decision).

Viral Video: ఇలాంటోళ్లతో రైళ్లల్లో ప్రయాణించడం నరకమే! మహిళ ఎంతకు తెగించిందో చూడండి!


ఈ పోస్టు తెగ వైరల్ అయ్యింది. జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తామూ ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నామని అనేక మంది చెప్పుకొచ్చారు. ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్‌గా పదిహేనేళ్ల అనుభవం ఉన్న తనను కూడా దరఖాస్తు చేసుకున్న నిమిషాల్లో తిరస్కరించారని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. హెచ్‌ఆర్‌లో పనిచేసని ఓ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు. తాము ఓ అభ్యర్థి అప్లికేషన్ తిరస్కరించేందుకు కనీసం 14 రోజుల సమయం తీసుకునేవాళ్లమని, వారాంతాల్లో ఎప్పుడూ అభ్యర్థలకు ఈమెయిల్స్ పంపించి ఇబ్బంది పెట్టేవాళ్లం కాదని చెప్పుకొచ్చాడు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఉదంతం వైరల్‌గా మారింది. అనేక మంది ఏఐ సాంకేతికతపై ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 04:10 PM