Viral: ఎంత మంచి మనసు బాసూ నీది.. అసలైన మనిషంటే నువ్వే!
ABN , Publish Date - Apr 27 , 2024 | 08:58 PM
నీటికి కొట్టుకుపోయిన రోడ్డు దాటించేందుకు ఓ వ్యక్తి కుక్కకు సాయపడిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలోని వ్యక్తి మానవత్వం అనేక మందిని కదలించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మనుషుల కంటే ఎక్కువగా ఇక్కట్లపాలయ్యేది జంతువులే. ఇలాంటి ఇబ్బందిలో ఇరుక్కున్న ఓ కుక్క రక్షించి మానవత్వాన్ని చాటుకున్నాడో వ్యక్తి. తనను కాపాడినందుకు ఆ కుక్క సంబరంతో తోక ఊపుతూ అతడి చుట్టూనే తిరిగిన తీరు ప్రస్తుతం నెటిజన్లను కదిలిస్తోంది. ఘటన ఎక్కడ జరిగిందీ క్లారిటీ లేకపోయినా వీడియో మాత్రం విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, భారీ వర్షం కారణంగా అక్కడ రోడ్డు కొట్టుకుపోయింది. మధ్యలోంచి నీరు భారీ వేగంతో ప్రవహిస్తోంది. జనాలు మాత్రం రాకపోకలకు వీలుగా రోడ్డు రెండు వైపులనూ కలుపుతూ నీటిపై ఓ చెక్క వేసి దానిపై నడుచుకుంటూ నీటి ప్రవాహాన్ని దాటుతున్నారు. కానీ ఈ ఏర్పాటు ఓ కుక్కకు ఇబ్బందిగా మారింది. దీంతో, ఏం చేయలేక అది అక్కడే భయంభయంగా కూర్చుండిపోయింది.
Viral: భర్తతో ఉన్న రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన మహిళ.. నెట్టింట దారుణంగా ట్రోలింగ్
ఇదంతా గమనించిన ఓ యువకుడు ఆ మూగజీవానికి సాయంగా వచ్చాడు. దాన్ని ముందు ఎత్తుకుని చెక్కబల్లపై నడిపించే ప్రయత్నం చేశాడు కానీ కుక్క మాత్రం ఒంటరిగా నీటిని దాటేందుకు సాహసించలేకపోయింది. దీంతో, ఆ కుర్రాడు కుక్కను ఎత్తుకుని చెక్క బల్లపై నడుచుకుంటూ వెళ్లి దాన్ని రోడ్డుకు అవతలి వైపు దిగబెట్టాడు.
ఇక తనని కాపాడిన వ్యక్తిని చూసి ఆ కుక్క సంబరానికి అంతేలేకుండా పోయింది (Dogs Reaction To Man Helping It Cross A Bridge Is Unmissable). చాలా సేపు తోక ఊపుతూ అతడి చుట్టూనే తిరిగింది. ఇది చూసిన జనాలు అతడిపై ప్రశంసలు కురిపించాడు. తనను కాపాడిన వ్యక్తి పట్ల ఆ కుక్క జీవితాంతం విశ్వాసంగా ఉంటుందని చెప్పారు. కుక్కకు సాయపడ్డ అతడిది నిజంగా మంచి మనసంటూ కామెంట్స్ చేశారు. మానవత్వం అంటే ఇదేనంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ (viral) అవుతోంది.