Share News

Viral Video: బికినీలో బస్సెక్కేసిన భామ.. బామ్మ ఇచ్చిన రియాక్షన్ చూస్తే అవాక్కవాల్సిందే..

ABN , Publish Date - Apr 20 , 2024 | 05:16 PM

దిల్లీ మెట్రో.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం కన్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను బాగా యూజ్ చేసుకునే వారికి ఉపయోగపడుతుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

Viral Video: బికినీలో బస్సెక్కేసిన భామ.. బామ్మ ఇచ్చిన రియాక్షన్ చూస్తే అవాక్కవాల్సిందే..

దిల్లీ మెట్రో.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం కన్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను బాగా యూజ్ చేసుకునే వారికి ఉపయోగపడుతుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు. సామాజిక మాధ్యమాల మోజులో పడి అక్కడి యువత ప్రవర్తిస్తున్న తీరుతో దిల్లీ మెట్రో పేరు ప్రఖ్యాతలు మసకబారుతున్నాయి. వాళ్లు చేసే తప్పుడు పనులు, వెకిలి చేష్టలు నెటిజన్ల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఇకపై ఆ వంతు బస్సులది.. అని అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అక్కడి యూత్. ప్రజా రవాణా బస్సుల్లో చీదరించుకునే పనులు చేస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం దిల్లీ బస్సులకు సంబంధించిన ఓ వీడియో వైరల్ ( Viral ) గా మారింది.

Elections 2024: ఎన్నికల వేళ హింసతో అట్టుడుకుతున్న బెంగాల్.. కూచ్ బిహార్ లో రాళ్లదాడి..


వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి ప్రజా రవాణా బస్సులో ఎక్కింది. ఒక్కసారిగా ఆ యువతిని చూసిన ప్రయాణికులు అవాక్కయ్యారు. వెంటనే ముఖం తిప్పేసుకున్నారు. కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓ ముసలావిడ ఇచ్చిన రియాక్షన్ మాత్రం వీడియో మొత్తానికే హైలైట్ గా మారింది. దీనికి కారణం ఏంటంటే.. సదరు యువతి బికినీ వేసుకుని బస్సు ఎక్కేయడమే. కామన్ గా ఎవరైనా బయటకు వెళ్లేటప్పుడు మంచి దుస్తులు ధరించి హుందాగా వెళతారు. కానీ ఈ యువతి మాత్రం ఏకంగా బికినీ వేసుకోవడం, అంతటితో ఆగకుండా పబ్లిక్ లోకి బయటికి రావడం హాట్ టాపిక్ గా మారాయి.


Devotional: విశాఖలో వైభవంగా మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు..

ఈ క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు. అసలు ఆమెను ఎలా బస్సు ఎక్కనిచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. మగవాళ్లు ఇలా ప్రదర్శిస్తే వదిలేసేవారా అని నిలదీస్తున్నారు. యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 20 , 2024 | 05:16 PM