Share News

Mumbai: దారుణం.. హోటల్‌లో కుళ్లిన చికెన్ షావర్మా.. తిన్నవారి పరిస్థితి ఏమైందంటే

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:04 PM

హోటల్‌లలో వండిన ఆహారాన్ని అసలు నమ్మేలా ఉండట్లేదు. ఆహారంలో కప్పలు, బొద్దింకలు, బల్లులు, ఎలుకలు తదితర జీవాల అవశేషాలు కనిపించిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే తాజాగా ఓ హోటల్ యజమాని కుళ్లిన చికెన్‌తో షావర్మా(chicken shawarma) చేసిపెట్టాడు.

Mumbai: దారుణం.. హోటల్‌లో కుళ్లిన చికెన్ షావర్మా.. తిన్నవారి పరిస్థితి ఏమైందంటే

ముంబై: హోటల్‌లలో వండిన ఆహారాన్ని అసలు నమ్మేలా ఉండట్లేదు. ఆహారంలో కప్పలు, బొద్దింకలు, బల్లులు, ఎలుకలు తదితర జీవాల అవశేషాలు కనిపించిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే తాజాగా ఓ హోటల్ యజమాని కుళ్లిన చికెన్‌తో షావర్మా(chicken shawarma) చేసిపెట్టాడు.

అది తిన్న 12 మంది తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిపాలయ్యారు. ముంబై(Mumbai)లోని గోరెగావ్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఏప్రిల్ 26, 27 తేదీల్లో గోరరేగావ్‌లోని ఓ హోటల్‌లో 12 మంది చికెన్ షావర్మా తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లాక అందరూ అస్వస్థకు గురయ్యారు.


తీవ్రంగా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు రావడంతో ఆసుపత్రికి పరుగులు తీశారు. వారికి వైద్య పరీక్షించిన నిర్వహించిన డాక్టర్లు ఫుడ్ పాయిజన్ జరిగిందని నిర్ధారణకొచ్చారు. సంతోష్ నగర్ ప్రాంతంలోని హోటల్‌లో తిన్న కుళ్లిన చికెన్‌తో వండిన ఆహారంతోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు గుర్తించారు.

ఆసుపత్రిలో చేరిన 12 మందిలో 9 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. ఘటనకు కారణమైన హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి.. హోటల్‌ని సీజ్ చేస్తామని ఎస్పీ వెల్లడించారు.


మరికొన్ని ఘటనలు..

నెల రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో 76 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. హాస్టల్ నిర్వాహకులు వండిన ఆహారం తిని అస్వస్థకు గురైనట్లు అధికారులు తెలిపారు. భోజనం చేసిన వెంటనే చాలా మందికి అస్వస్థత, కళ్లు తిరగడం, వాంతులు జరిగాయని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.

అంతకుముందే పుణే ఖేడ్ తహసీల్‌లోని కోచింగ్ సెంటర్‌కు చెందిన 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. తెలంగాణలో కూడా ఈ మధ్యే గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. ఇలా నిత్యం ఏదో చోట నిర్వాహకుల వైఫల్యంతో ఫుడ్ పాయిజన్ జరుగుతున్నా అధికారులు తనిఖీలు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

Read Latest news and National News here..

Updated Date - Apr 29 , 2024 | 01:04 PM