TDP: కురుపాం, చీపురుపల్లి, విశాఖలో చంద్రబాబు ప్రజాగళం..

ABN, Publish Date - May 10 , 2024 | 12:18 PM

విశాఖపట్నం: టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పన్నుల బాదుడు లేని పారదర్శక పాలన అందిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జనం భవిష్యత్‌కు కూటమిదే బాధ్యతని భరోసా ఇచ్చారు. జగన్‌ భారీగా అప్పులు తెచ్చి బటన్‌ నొక్కుడు చేసి మిగిలిన మొత్తాన్ని జేబులోకి బుక్కుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి పని తాను చేయనని.. సంపదను సృష్టించి ఆ సొమ్ముతో ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మిగిలినవీ అమలు చేస్తానన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చి అన్ని విధాలా మంచి పాలన అందిస్తానని తెలిపారు. గురువారం ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి, విశాఖ నగరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. జగన్‌ బటన్‌ నొక్కినా ఖాతాల్లోకి డబ్బులు రావడం లేదన్నారు. మరోవైపు ధరలు, పన్నులు పెంచేశారని... వచ్చిన డబ్బులు వచ్చినట్లే పోయి తిరిగి అప్పులు మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

TDP: కురుపాం, చీపురుపల్లి, విశాఖలో చంద్రబాబు ప్రజాగళం.. 1/9

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన ప్రజాగళంలో ప్రసంగిస్తున్న దృశ్యం.. ప్రక్కన కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత.

TDP: కురుపాం, చీపురుపల్లి, విశాఖలో చంద్రబాబు ప్రజాగళం.. 2/9

టీడీపీ అధినేత చంద్రబాబు కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..

TDP: కురుపాం, చీపురుపల్లి, విశాఖలో చంద్రబాబు ప్రజాగళం.. 3/9

తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత.

TDP: కురుపాం, చీపురుపల్లి, విశాఖలో చంద్రబాబు ప్రజాగళం.. 4/9

విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రక్కన కూటమి నేతలు..

TDP: కురుపాం, చీపురుపల్లి, విశాఖలో చంద్రబాబు ప్రజాగళం.. 5/9

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రక్కన అసెంబ్లీ కూటిమి అభ్యర్థి విష్ణు కుమార్ రాజు, ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కుమార్.

TDP: కురుపాం, చీపురుపల్లి, విశాఖలో చంద్రబాబు ప్రజాగళం.. 6/9

విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజాగళం రోడ్ షోలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రక్కన కూటమి టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు..

TDP: కురుపాం, చీపురుపల్లి, విశాఖలో చంద్రబాబు ప్రజాగళం.. 7/9

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం విశాఖ నగరంలో నిర్వహంచిన ప్రజాగళం రోడ్ షో.. ప్రక్కన కూటమి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు.

TDP: కురుపాం, చీపురుపల్లి, విశాఖలో చంద్రబాబు ప్రజాగళం.. 8/9

విశాఖలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో కూటమి నేతలు వంశీ కృష్ణ, విష్ణుకుమార్ రాజు..

TDP: కురుపాం, చీపురుపల్లి, విశాఖలో చంద్రబాబు ప్రజాగళం.. 9/9

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖలో నిర్వహించిన ప్రజాగళం సభకు భారీగా తరలి వచ్చిన జనం..

Updated at - May 10 , 2024 | 12:20 PM