Share News

Onion Water : ఉల్లిపాయ నీటితో జుట్టు, చర్మం రెండూ మెరుస్తాయి.. ట్రై చేసి చూడండి..!

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:12 PM

ఉల్లిపాయ నీటిలో సల్ఫర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ పోషకం కారణంగానే ఉల్లిపాయను తరిగిన వెంటనే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సల్ఫర్ వెల్లుల్లి, క్రూసిఫెరస్ కూరలు, మాంసం, గుడ్లు ఇలా చాలా వాటిలో కనిపిస్తుంది.

Onion Water : ఉల్లిపాయ నీటితో జుట్టు, చర్మం రెండూ మెరుస్తాయి.. ట్రై చేసి చూడండి..!
Onion Water

ఉల్లిపాయ లేనిదే కూరకు రుచి ఉండదు. ఈ మధ్య కాలంలో ఉల్లిపాయలను జుట్టు పెరిగేందుకు చాలా ఎక్కువగానే వాడుతున్నారు. జుట్టు పెరుగుదలలోనే కాదు.. ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ చలవ చేస్తుంది. ఇక ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి మనలో పాతుకుపోయిందేమో.. ఉల్లిపాయను వంటల్లోనూ, ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతూనే ఉంటాం. ఉల్లి రసంతో తలకు మంచి నిగారింపు వస్తుంది. దీనిని తలకు పట్టించి కాసేపటి తర్వాత తలకు స్నానం చేయడం వల్ల వెంట్రుకలు బలంగా, కుదుళ్ళు గట్టిగా మారతాయి. ఇంకా ఉల్లిపాయతో కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

ఉల్లిపాయలో బిగుతును తగ్గించే రసాయనాలు ఉన్నాయి . ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తంలో చక్కెరను తగ్గించే రసాయనాలను కూడా కలిగి ఉంది. ముఖం మీద ఏర్పడే మచ్చలను నివారించడానికి ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. ఇది ఊబకాయం , జుట్టు రాలడం , ఉబ్బసం, నిద్రలేమి , అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. మొటిమలకు చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది.

వేసవిలో మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?

ఉల్లిపాయనీటిలో సల్ఫర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ పోషకం కారణంగానే ఉల్లిపాయను తరిగిన వెంటనే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సల్ఫర్ వెల్లుల్లి, క్రూసిఫెరస్ కూరలు, మాంసం, గుడ్లు ఇలా చాలా వాటిలో కనిపిస్తుంది. స్కాల్ఫ్ మీద చిన్నగా ఉల్లి రసాన్ని మర్దనా చేయడం వల్ల వెంట్రుకలు బలంగా మారతాయి. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.


Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!

పోషక లోపాలు, ఆండ్రోజెనెటిక్ అలోపేసియా వంటి సమస్యలు ఉన్నవారికి జుట్టు రాలడం వంటి సమస్య ఉంటే ఉల్లిపాయ నీరు వారికి పనిచేయదు,

ఉల్లి రసం ఆరోగ్య కరమైన జుట్టు, చర్మానికి ఖనిజాలను, విటమిన్లను అందిస్తుంది. హెయిర్ కేర్ ప్రోడక్ట్ లో ఉల్లిపాయ వాడటం వల్ల అలోపేసియా అరేటా, చుండ్రు, జుట్టు రాలడం అనేక ఇతర పరిస్థితులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

చర్మానికి కూడా ఉల్లి చక్కని ఉపశమనం అందిస్తుంది. ఉల్లి నీటిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. చర్మ నిగారింపుకు సహకరిస్తాయి.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 29 , 2024 | 03:12 PM