Share News

Cumin water : ఈ నీటిని ఉదాయాన్నే తాగుతున్నారా? దీనిని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలంటే..

ABN , Publish Date - May 04 , 2024 | 03:37 PM

జీలకర్ర జీర్ణక్రియకు మెరుగ్గా పనిచేస్తుంది. జీలకర్ర థైమోల్ ముఖ్యమైన నూనెలుంటాయి. ఇవి లాలాజల గ్రంధులను ఉత్తేజపరుస్తాయి. జీలకర్ర నోటిని శుభ్రంగా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Cumin water : ఈ నీటిని ఉదాయాన్నే తాగుతున్నారా? దీనిని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలంటే..
Foods to eat daily

బరువు పెరగకుండా ఉండాలని చేసే చాలా ప్రయత్నాలలో ఏది కొత్తగా అనిస్తే అది పాటిస్తూ ఉంటాం. కానీ ఎళ్ళ తరబడి మన ఆహారంలో భాగంగా ఉన్నజీలకర్రను తీసుకుంటే చాలట.. ప్రత్యేకించి మరేదీ ప్రయత్నించాల్సిన అవసరం ఉండదనేది నిపుణుల సలహా. జీలకర్ర ఆహారాన్ని రుచిగా మారుస్తుంది. ముఖ్యంగా ఊబకాయాన్ని తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

బరువు తగ్గాలంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా జీలకర్ర నీటిని తీసుకోవడం మంచిది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో ఉండే హానికరమైన లిపిడ్ల స్తాయిలను తగ్గిస్తుంది.

జీర్ణక్రియకు..

జీలకర్ర జీర్ణక్రియకు మెరుగ్గా పనిచేస్తుంది. జీలకర్ర థైమోల్ ముఖ్యమైన నూనెలుంటాయి. ఇవి లాలాజల గ్రంధులను ఉత్తేజపరుస్తాయి. జీలకర్ర నోటిని శుభ్రంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


Sugarcane juice : చెరుకు రసాన్ని రెండు నిమిషాల్లో ఇంట్లోనే ఎలా చేయచ్చో తెలుసా..!

రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది..

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, మంచి ఆరోగ్యం పొందుతారు. ఉదయాన్నే జీలకర్ర నీరు తీసుకోవడం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఒక టీ స్పూన్ జీలకర్రను వేడి నీటిలో మరిగించి ఉదయాన్నే తాగడం వల్ల బరువు తగ్గుతారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఈ నీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.


Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!

1. సహజ మార్గంలో ఇన్సులిన్ పొందే వీలుంటుంది.

2. ఇందులోని ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని మంటను తగ్గిస్తాయి.

3. జీలకర్రలోని ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్ కలిపి ఉంటుంది. ఇది ఆక్సిజన్ ప్రసరణ పెంచేందుకు పనిచేస్తుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 04 , 2024 | 03:37 PM