Share News

Elections 2024: 400 సీట్ల లక్ష్యం అంత ఈజీ కాదు.. ప్రధానిపై శరద్ పవార్ మండిపాటు..

ABN , Publish Date - Apr 20 , 2024 | 05:57 PM

ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi ) పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 కు పైగా సీట్లు కైవసం చేసుకుంటుందన్న ప్రధాని ప్రకటనను ఆయన ఖండించారు. సాగునీటి కుంభకోణానికి సంబంధించి ప్రధాని చేసిన ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు.

Elections 2024: 400 సీట్ల లక్ష్యం అంత ఈజీ కాదు.. ప్రధానిపై శరద్ పవార్ మండిపాటు..

ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi ) పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 కు పైగా సీట్లు కైవసం చేసుకుంటుందన్న ప్రధాని ప్రకటనను ఆయన ఖండించారు. సాగునీటి కుంభకోణానికి సంబంధించి ప్రధాని చేసిన ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు. ఇందులో బాధ్యులెవరో తెలపాలన్నారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపి, నిజానిజాలను ప్రజలకు చెప్పాలని శరద్ పవార్ డిమాండ్ చేశారు. ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. నాగ్‌పూర్‌లోనే కాకుండా భోపాల్ సమావేశంలోనూ ప్రధాని మోదీ నీటి పారుదలతో పాటు రాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంపై ఎన్‌సీపీ పార్టీని ఆరోపించారు. గత పదేళ్లల్లో ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.


Amit Shah: సొంత కారు లేదు.. రూ.15 లక్షల అప్పు ఉంది.. అమిత్ షా ఆస్తుల విలువ ఇవే..

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి, మహాయుతి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ పొత్తులు, కూటములు రెండింటిలోనూ ఒక్కొక్కటి మూడు పార్టీలు ఉన్నాయి. మహావికాస్ అఘాడిలో సీట్ల కేటాయింపు ఫార్ములా 22, 16, 10. ఇందులో ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు 22, కాంగ్రెస్‌కు 16, శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీకి 10 సీట్లు వచ్చాయి. ఎన్‌సీపీకి ఎందుకు తక్కువ సీట్లు వచ్చాయన్న ప్రశ్నపై స్పందించిన పవార్ తమ పార్టీ టార్గెట్ లోక్ సభ కాదని, అసెంబ్లీ అని అన్నారు.


Supreme Court: పిల్లలతో పోర్న్ వీడియోలు చేయడం తీవ్ర నేరమే.. సుప్రీంకోర్టు

ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి 50 శాతం సీట్లు గెలుచుకుంటుందని శరద్ పవార్ అశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎక్కువ సీట్లు సాధించి, ఎక్కువ సంఖ్యలో మిత్రపక్షాలను లోక్‌సభకు పంపడమే తమ లక్ష్యం అని తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 20 , 2024 | 05:57 PM