Share News

Gold Smuggling: దుస్తుల్లో సీక్రెట్‌గా 25 కేజీల బంగారం.. అడ్డంగా బుక్కైన దౌత్యవేత్త..

ABN , Publish Date - May 04 , 2024 | 07:59 PM

స్మగ్లర్లు.. బంగారం, డ్రగ్స్, అరుదైన వస్తువులు, జంతుజాలాలను స్మగ్లింగ్(Smuggling) చేయడం చూశాం.. కానీ, ఒక దేశ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు, దౌత్యవేత్తలు (Consul General of the Afghanistan) స్మగ్లింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? అతిధి మర్యాదలు పొందుతూ.. అటు స్వదేశం నుంచి, ఇటు ఆథిత్య దేశం నుంచి సకల సౌకర్యాలు ఆస్వాదిస్తూ..

Gold Smuggling: దుస్తుల్లో సీక్రెట్‌గా 25 కేజీల బంగారం.. అడ్డంగా బుక్కైన దౌత్యవేత్త..
Zakia Wardak

ముంబై, మే 04: స్మగ్లర్లు.. బంగారం, డ్రగ్స్, అరుదైన వస్తువులు, జంతుజాలాలను స్మగ్లింగ్(Smuggling) చేయడం చూశాం.. కానీ, ఒక దేశ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు, దౌత్యవేత్తలు (Consul General of the Afghanistan) స్మగ్లింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? అతిధి మర్యాదలు పొందుతూ.. అటు స్వదేశం నుంచి, ఇటు ఆథిత్య దేశం నుంచి సకల సౌకర్యాలు ఆస్వాదిస్తూ.. గౌరవప్రదమైన దౌత్యవేత్తగా ఉండి స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 25 కేజీల బంగారాన్ని విదేశాల నుంచి తీసుకువస్తూ ఎయిర్ పోర్ట్ అధికారులకు పట్టుబడ్డారు. ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను కూడా వారు వినియోగించారు. ఇంతకీ స్మగ్లింగ్ చేస్తూ చిక్కిందెవరు? ఆ దౌత్యవేత్త ఏదేశానికి చెందిన వారు? ఎక్కడ దొరికిపోయారు? కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


భారత్‌లోని అఫ్గానిస్థాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జకియా వార్దక్‌ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో అడ్డంగా దొరికిపోయారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆమె.. 25 కేజీల బంగారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో దాచిపెట్టి తీసుకువచ్చారు. అయితే, డీఆర్ఐ అధికారులు ఆమె గుట్టును రట్టు చేశారు. అక్రమంగా రవాణా చేసిన బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ. 18.6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

zakia-wardak.jpg


పక్కా సమాచారంతో..

అఫ్గానిస్థాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జకియా వార్దక్‌ ఇటీవల దుబాయ్‌కి వెళ్లారు. అక్కడి నుంచి 25 కేజీల బంగారాన్ని దుస్తులు దాచి పెట్టి ఇండియాకు అక్రమంగా రవాణా చేశారు. అయితే, అప్పటికే ముంబై విమానాశ్రయంలోని డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. ఆమె దుబాయ్ నుంచి ముంబై విమానాశ్రయంలో దిగగానే.. డీఆర్ఐ అధికారులు అడ్డగించారు. ఆమెను తనిఖీ చేయగా.. పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. వాస్తవానికి ఆమెకు దౌత్యవేత్త కావడంతో విమానం నుంచి దిగిన తరువాత.. గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా ఎయిర్‌పోర్టు బయటకు వచ్చేశారు. అయితే, ఎయిర్‌పోర్టు ఎగ్జిట్ గేట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకుని తనిఖీ చేశారు. దీంతో అసలు మ్యాటర్ రివీల్ అయ్యింది. ఈ ఘటన ఏప్రిల్ 25న చోటు చేసుకోగా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ స్మగ్లింగ్ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, జకియా వార్దక్ దౌత్యవేత్త కావడంతో ఆమెను అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.

For More National News and Telugu News..

Updated Date - May 04 , 2024 | 07:59 PM