Share News

LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:27 PM

లఖ్‌నవూ లోకసభ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నామినేషన్ వేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామితోపాటు యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ఉన్నారు. అంతకుముందు లఖ్‌నవూ నగర పుర వీధుల్లో రాజ్‌నాథ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోడ్ షో ప్రారంభానికి ముందు స్థానిక హనుమాన్ సేతు దేవాలయంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh Road Show in LuckNow

లఖ్‌నవూ: లఖ్‌నవూ లోకసభ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నామినేషన్ వేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామితోపాటు యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ఉన్నారు. అంతకుముందు లఖ్‌నవూ నగర పుర వీధుల్లో రాజ్‌నాథ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోడ్ షో ప్రారంభానికి ముందు స్థానిక హనుమాన్ సేతు దేవాలయంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

AP Elections: ఆ ఓట్లపైనే ఫోకస్.. ఆకర్షించేందుకు పోటీపడుతున్న పార్టీలు..


2014 ఎన్నికల నుంచి లఖ్‌నవూ బీజేపీ అభ్యర్థిగా రాజ్‌నాథ్ సింగ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అంతకు ముందు అంటే.. 2009 ఎన్నికల్లో ఆయన ఘజియాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాజ్‌నాథ్ సింగ్ చేతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రొ.రీటా బహుగుణ ఓటమి పాలయ్యారు.

Lankadinakar: జగన్ చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత.. దోచుకుంది అనకొండంత...


ఇక 2019 ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగిన పూనమ్ శతృఘ్నసిన్హాను రాజ్‌నాథ్ సింగ్ ఓడించారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యర్థిగా.. సమాజవాదీ పార్టీ అభ్యర్థిగా రవిదాస్ మహోత్రా పోటీ చేస్తున్నారు. 2014లో మోదీ కేబినెట్‌లో హోం శాఖ మంత్రిగా రాజ్ నాథ్ పని చేశారు. అలాగే 2019లో మోదీ కేబినెట్‌లో రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ భాధ్యతలు చేపట్టారు. దేశంలోనే ఉత్తరప్రదేశ్‌ అతిపెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 01:27 PM