Share News

LokSabha Elections: దేశంలో ఎయిర్ పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:43 PM

ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాంటి వేళ.. దేశంలోని పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్టుల్లో బాంబులు పెట్టినట్లు.. ఎయిర్ పోర్ట్ సంబంధిత ఉన్నతాధికారులకు ఈ మెయిల్‌ వచ్చింది.

LokSabha Elections: దేశంలో ఎయిర్ పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాంటి వేళ.. దేశంలోని పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్టుల్లో బాంబులు పెట్టినట్లు.. ఎయిర్ పోర్ట్ సంబంధిత ఉన్నతాధికారులకు ఈ మెయిల్‌ వచ్చింది.

AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్!


TS SSC Results Updates : రేపే 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

దీంతో ఎయిర్ పోర్ట్ భద్రత సిబ్బంది అప్రమత్తమై.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే బాంబ్ డిస్పాజబుల్ స్వాడ్‌‌తోపాటు జాగిలాలను సైతం రంగంలోకి దింపారు. అయితే ఈ బాంబు బెదిరింపులు నకిలీవి అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ క్రమంలో ఈ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్

ఇక ఎయిర్ పోర్ట్‌ల వద్ద భద్రతను మరింత పెంచారు. మరోవైపు ఏప్రిల్ 26వ తేదీన జైపూర్ ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్‌లో బాంబు పెట్టామంటూ ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులకు పోన్ కాల్స్ అందాయి. దాంతో ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేసి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ ఏమి లేక పోవడంతో.. వచ్చిన ఫోన్ కాల్ నకిలీదని పోలీసులు నిర్ధారించారు.

Read National News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 04:43 PM