Share News

HD Revanna: కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణను నిర్బంధంలోకి తీసుకున్న సిట్

ABN , Publish Date - May 04 , 2024 | 08:18 PM

కిడ్నాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ తనయుడు, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ శనివారంనాడు నిర్బంధంలోకి తీసుకుంది. బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హెచ్‌డీ రేవణ్ణపై రెండ్రోజుల క్రితం కిడ్నాపింగ్ కేసు నమోదైంది.

HD Revanna: కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణను నిర్బంధంలోకి తీసుకున్న సిట్

బెంగళూరు: కిడ్నాపింగ్ (Kidnapping) కేసుకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ తనయుడు, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ (HD Revanna)ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) శనివారంనాడు నిర్బంధంలోకి తీసుకుంది. బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హెచ్‌డీ రేవణ్ణపై రెండ్రోజుల క్రితం కిడ్నాపింగ్ కేసు నమోదైంది.

Prajwal Revanna: ప్రజ్వల్‌కు మళ్లీ లుకౌట్ నోటీసు.. ఇంట్లో సిట్ సోదాలు


తన తల్లిని అహహరించుకు వెళ్లినట్టు ఒక యువకుడు కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‍లో గత గురువారం ఫిర్యాదు చేయడంతో హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ మరింత చిక్కుల్లో పడ్డారు. రేవణ్ణ సదరు మహిళను తాళ్లతో కట్టి, అత్యాచారానికి పాల్పడినట్టు ఒక వీడియో వెలుగు చూసిన క్రమంలోనే ఆమె ఆపహరణ జరిగింది. తన తల్లిని రేవణ్ణే కిడ్నాప్ చేసినట్టు ఆ యువకుడు తన ఫిర్యాదులో ఆరోపించాడు. హోలెనరసిపురలోని రేవణ్ణ నివాసంలో తన తల్లి ఆరేళ్లు పనిచేసిందని, మూడేళ్ల క్రితం ఆ పని మానేసి స్వస్థలానికి తిరిగి వచ్చిందని వివరించాడు. అయితే ఐదు రోజుల క్రితం రేవణ్ణ సహచరుడు సతీష్ బాబాన్న తమ ఇంటికి వచ్చాడని, మీ అమ్మ పట్టుబడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని, తనతో తీసుకు వెళ్తానని చెప్పి ఆమెను మోటారుసైకిలుపై తీసుకువెళ్లాడని ఆ ఫిర్యాదులో యువకుడు పేర్కొన్నాడు. కాగా, ఇప్పటికే ప్రజల్ రేవణ్ణ 'రాసలీలలు' సోషల్ వీడియాల్లో సంచలనం కావడంతో ఆయన కర్ణాటక వదలి జర్మనీ వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'సిట్' వెంటనే రంగంలోకి దిగి ప్రజ్వల్‌కు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సిట్ విచారణకు హాజరయ్యేందుకు తమకు మరింత సమయం కావాలంటూ ప్రజ్వల్, హెచ్‌డీ రేవణ్ణ చేసిన విజ్ఞప్తితో సిట్ ఈ నోటీసులు జారీ చేసింది. హెచ్‌డీ రేవణ్ణ విదేశాలకు పారిపోకుండా కూడా లుకౌట్ నోటీసులిచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2024 | 08:18 PM