Share News

Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. ఆ పని చేయొద్దని సీజేఐ చంద్రచూడ్ సూచన

ABN , Publish Date - Apr 20 , 2024 | 02:11 PM

ఎందుకో తెలీదు కానీ.. తమకు ఓటు హక్కు ఉన్నప్పటికీ కొందరు దానిని వినియోగించరు. పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు వేయరు. ఈ నేపథ్యంలోనే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ ఓటర్లకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి..

Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. ఆ పని చేయొద్దని సీజేఐ చంద్రచూడ్ సూచన
CJI Chandrachud Urges Voters To Not Miss Voting

ఎందుకో తెలీదు కానీ.. తమకు ఓటు హక్కు (Right To Vote) ఉన్నప్పటికీ కొందరు దానిని వినియోగించరు. పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు వేయరు. ఈ నేపథ్యంలోనే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ (CJI Chandrachud) ఓటర్లకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి.. ప్రజలు తమ ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని ఆయన సూచించారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరుల ప్రధాన కర్తవ్యమని తెలిపారు.


శివమ్ దూబే చీటింగ్ చేశాడా.. అంపైర్ ఎందుకలా చెక్ చేశాడు?

‘లోక్‌సభ ఎన్నికలు-2024’ (Lok Sabha Polls 2024) కోసం ఎన్నికల సంఘం ‘మై ఓట్ మై వాయిస్’ (My Vote My Voice) అనే మిషన్‌ని తీసుకొచ్చింది. ఈ మిషన్ కోసం చంద్రచూడ్ ఒక వీడియో సందేశం పంపారు. ‘‘మనమంతా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశపు పౌరులం. రాజ్యాంగం మనకు పౌరులుగా అనేక హక్కులను ఇచ్చింది. అలాగే.. మనపై విధించిన విధులను సైతం నిర్వర్తించాలని ఈ రాజ్యాంగం ఆశిస్తుంది. అందులో ప్రధానమైనది.. ఓటు వేయడం. దీనిని మనం సక్రమంగా నిర్వర్తించాలి. బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను ప్రతిఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం ఐదు నిమిషాలు వెచ్చించలేరా? పదండి.. అందరూ కలిసి గర్వంగా ఓటు వేద్దాం’’ అని ఆ వీడియోలో చంద్రచూడ్ పేర్కొన్నారు.

డెడ్ బాడీతో బ్యాంక్‌కి వెళ్లిన మహిళ.. చివరికి ఏమైందంటే?

ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో భారత పౌరులదే ప్రధాన పాత్ర ఉంటుందని.. అందుకే ‘ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలచే, ప్రజల కోసం’ అని చెప్పబడుతుందని చంద్రచూడ్ చెప్పుకొచ్చారు. తొలిసారి ఓటరుగా తన ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడు.. తాను దేశ భక్తిలో ఉప్పొంగిపోయానని గుర్తు చేసుకున్నారు. తాను లాయర్‌గా ఉన్నప్పుడు ఓటు వేసే తన బాధ్యతని ఎప్పుడూ మరవలేదని.. తానెంత బిజీగా ఉన్నా ఓటు వేసేందుకు వెళ్లేవాడినని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కు ఎంతో విలువైనదని అన్నారు. కాగా.. దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏప్రిల్ 19వ తేదీన తొలిదశ పోలింగ్ ముగిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 02:14 PM