Share News

TG Politics: నన్ను టచ్‌ చేస్తే మాడి మసైపోతావ్.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Apr 20 , 2024 | 03:04 PM

తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం నాడు మెదక్‌లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

TG Politics: నన్ను టచ్‌ చేస్తే మాడి మసైపోతావ్.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
CM Revanth Reddy strong counter to KCR

మెదక్: తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం నాడు మెదక్‌లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారని.. ముందు ఆయన పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో చూసుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌ ఎట్లా ఖాళీ అవుతుందో తానూ చూస్తానని అన్నారు. తాను హెచ్‌.టి.వైర్‌ లాంటోడిని.. టచ్‌ చేస్తే మాడి మసైపోతావ్ అని కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నిగ్ ఇచ్చారు.


BRS: గులాబీ పార్టీలో గుబులు.. కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధం..?

కేసీఆర్.. ఎవరితో వస్తావో.. రా.. ఇక్కడుంది జైపాల్‌రెడ్డి, జానారెడ్డి కాదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే నీలం మధుని మెదక్ ఎంపీగా గెలిపించాలని కోరారు. 15 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ గెలవబోతోందని జోస్యం చెప్పారు. మెదక్‌ పాతికేళ్లుగా బీఆర్‌ఎస్‌, బీజేపీ చేతిలోనే ఉందన్నారు.

హామీ ఇచ్చిన రెండు గ్యారెంటీలను త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండుసార్లు అవకాశం వచ్చినా ప్రధాని పదవి రాహుల్‌ తీసుకోలేదని గుర్తుచేశారు. నీలం మధును గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.


BJP: ‘నన్ను పండబెట్టి తొక్కుతారా రండి చూద్దాం’.. రేవంత్‌కు డీకే అరుణ సవాల్

తెలంగాణకు ఇంకా తానే సీఎంనని కేసీఆర్‌ అనుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అవుతుందని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నేతలు ఏం చూసి బీఆర్‌ఎస్‌లోకి వస్తారని ప్రశ్నించారు.

ఎవరు వస్తారో రండి చూసుకుందామని కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. మోదీ, కేసీఆర్‌ మహిళల కళ్లలో అనందాన్ని చూడలేకపోతున్నారని విరుచుకుపడ్డారు. మెదక్‌లో ఎన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారని నిలదీశారు. పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.


వచ్చే పంటకు రూ.500 బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నప్పుడు.. మెదక్‌ గడ్డపై ఇందిరాగాంధీ విజయం సాధించారని గుర్తుచేశారు. మెదక్‌ నియోజకవర్గం 1999 నుంచి 2024 వరకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ చేతుల్లోనే ఉందన్నారు.

మెదక్‌కు బీఆర్‌ఎస్‌ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. ఏం చేశారని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్‌ ప్రజలకు చేసిందేమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సిగ్గులేకుండా మెదక్‌లో ఓట్లు అడుగుతున్నారన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉండి రఘునందన్‌రావు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారో బస్సు ఏసుకొని వస్తాం చూపించాలని సవాల్ విసిరారు. కేసీఆర్, హరీశ్‌రావులు ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాకే ఓట్లు అడగాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తొడుదొంగలు... ఇద్దరి వల్ల ఏం ఉపమోగం లేదన్నారు.


నరేంద్రమోదీ, కేసీఆర్ ఈ ప్రాంతానికి ఏం చేయలేదన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. కారు కరాబయింది.. తుక్కు కింద అమ్మేసే టైమ్ అయిందని సెటైర్లు గుప్పించారు. నౌకరు పోయి, నడుము పోయి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ ఉన్నారని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు... హై టెన్షన్ వైరు తగిలి కాకి ఎలా అవుతుందో ఆయనకు అలా అవుతుందని ఎద్దేవా చేశారు. ఉచిత బస్సు ప్రయాణం చూసి కేసీఆర్ కుళ్లుకుంటున్నారని మండిపడ్డారు.


సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డలకు మంచి జరిగితే తట్టుకోలేక మోదీ, కేసీఆర్ కలిసి కాంగ్రెస్ ఓటమికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను తమ ప్రభుత్వంలో మంజూరు చేశామని తెలిపారు. ఢిల్లీలో ఉండే మోదీ... గజ్వెల్‌లో ఉండే కేడీలు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టు లోపుల రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు బోనస్ ఇచ్చి.. ధాన్యం కొంటామని హామీ ఇచ్చారు.


పదేళ్లు హరీశ్‌రావు మెదక్ జిల్లాలో ఏ హామీ నెరవేర్చకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. హరీశ్‌లాంటి నేతలను తొక్కుకుంటూ వచ్చానని అన్నారు. పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది.. ఏం చేసుకుంటావో చేసుకో అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రైతులను చంపిన మోదీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన మోదీ ప్రభుత్వాన్ని దించేయాలన్నారు. పేదోడికి అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.


బలహీనవర్గాల అభ్యర్థి నీలం మధుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మెదక్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మల్లన్న సాగర్‌లో 50 వేల ఎకరాలను రైతుల నుంచి గుంజుకున్న దుర్మార్గుడని మండిపడ్డారు. మల్లన్న సాగర్‌లో 14 గ్రామాలను ఆయన ముంచారని ధ్వజమెత్తారు. వెంకట్రామిరెడ్డి గెలిస్తే రజాకార్ల లెక్క దొరకు గులాంగిరి చేస్తాడు తప్ప ప్రజలకు ఏం చేయరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


అవినీతి బీఆర్‌ఎస్‌ నుంచి పారిపోతున్న అభ్యర్థులు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 04:13 PM