Share News

Gudivada Amarnath: జగన్ ఏం తప్పు చేశారని రాళ్ళు విసురుతారు?

ABN , Publish Date - Apr 15 , 2024 | 03:28 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన దాడిని ప్రధానితో సహా అందరూ ఖండించారని... జగన్ ఏం తప్పు చేశారని రాళ్ళు విసురుతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాళ్ళ దాడి చేస్తే జగన్ ఇంటిలో కూర్చోటారని అనుకుంటే... అది పొరపాటే అని చెప్పుకొచ్చారు. సింపతీ కోసం.. దాడులు చేయించుకోవలసిన అవసరం తమకు లేదన్నారు. గాజువాక సభలో చంద్రబాబు తమ మీద చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గాజువాకలో బాబు మీద ఆ పార్టీల వాళ్ళే రాళ్ళు వేసుకొని .. వైసీపీ మీద అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Gudivada Amarnath: జగన్ ఏం తప్పు చేశారని రాళ్ళు విసురుతారు?
Minister Gudivada Amarnath

విశాఖపట్నం, ఏప్రిల్ 15: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jaganmohan Reddy) మీద జరిగిన దాడిని ప్రధానితో సహా అందరూ ఖండించారని... జగన్ ఏం తప్పు చేశారని రాళ్ళు విసురుతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Minister Gudivada Amarnath) ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాళ్ళ దాడి చేస్తే జగన్ ఇంటిలో కూర్చోటారని అనుకుంటే... అది పొరపాటే అని చెప్పుకొచ్చారు. సింపతీ కోసం.. దాడులు చేయించుకోవలసిన అవసరం తమకు లేదన్నారు. గాజువాక సభలో చంద్రబాబు తమ మీద చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గాజువాకలో బాబు మీద ఆ పార్టీల వాళ్ళే రాళ్ళు వేసుకొని .. వైసీపీ మీద అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి పట్టేయండి!


పవన్, బాబు వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేయించికున్నారని ఆరోపించారు. ఏదిఏమైనా, ప్రతిపక్షనేతల మీద దాడులను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ కంటే వైసీపీ హయంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని.. ఉద్యోగ అవకాశం కల్పించామన్నారు. ‘‘దావోస్‌లో చలి ఉందని నేను అనలేదని... దమ్ముంటే నేను అనట్లు సాక్ష్యం చూపించాలి’’ అంటూ సవాల్ విసిరారు.ర స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమని.. తమ స్టాండ్‌లో మార్పు లేదన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాటంలో ఎవరి మీద ఒక్క మీద కేసు పెట్టలేదని వెల్లడించారు. ‘‘నేను బ్యాక్ డోర్ పాలిటిషన్ కాదు.. మా తాత, తండ్రి కూడా ప్రజా ప్రతినిధులు’’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Delhi Liquor Scam: మళ్లీ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఎందుకంటే..

Lok Sabha polls 2024: సంఘవ్యతిరేకులతో రాహుల్ 'రహస్య ఒప్పందం'... మోదీ ఘాటు విమర్శ

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 15 , 2024 | 05:07 PM