Elections 2024: ఓటరులో చైతన్యం నింపిన ఆంధ్రజ్యోతి.. పోలింగ్ కేంద్రాలకు క్యూ..
ABN , Publish Date - May 13 , 2024 | 11:40 AM
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు భారత ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆంధ్రజ్యోతి తనవంతు ప్రయత్నం చేస్తూ వస్తుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు భారత ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆంధ్రజ్యోతి తనవంతు ప్రయత్నం చేస్తూ వస్తుంది. గత రెండు రోజులుగా ఓటరులో అవగాహన కల్పించేందుకు అనేక వార్తలను ప్రచారం చేస్తూ వచ్చింది. ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువను తెలియజేయడంతో పాటు.. నిర్లక్ష్యం వీడి ఓటు ఎందుకు వెయ్యాల్లో పూర్తి అవగాహన కల్పించేలా అనేక వరుస కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. ముఖ్యంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో యువత ఓటింగ్‌కు దూరంగా ఉంటుండటంతో వాళ్లందరూ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆంధ్రజ్యోతి వార్తలు ప్రచురించింది. దీని ఫలితంగా ఓటింగ్ శాతం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత పోలింగ్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. వీరిలో యువత అధికంగా ఉంటున్నారు. ఆంధ్రజ్యోతి కల్పించిన అవగాహన ఓటర్లలో చైతన్యం వచ్చినట్లు కనిపిస్తోంది.
AP Elections: ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి కేశినేని చిన్ని.. కానీ
పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా..
ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఆంధ్రజ్యోతి విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది. అన్ని వర్గాల ఓటర్లను అవగాహన పరిచే విధంగా అనేక కథనాలు ప్రచురించింది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు చూస్తుంటే ఆంధ్రజ్యోతి ఆశయం నెరవేరే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్లలో అవగాహన కల్పించేందుకు ఆంధ్రజ్యోతి చేస్తున్న ప్రయత్నా్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఓటు వేయలేదా వెంటనే వెళ్లండి..
ఇప్పటివరకు ఎవరైనా ఓటు హక్కు ఉండి ఇంకా వేయకపోతే.. వెంటనే బయల్దేరి పోలింగ్ కేంద్రానికి వెళ్లండి.. ఓటు వేసిరండి.. మన ఓటుతో ఏమవుతుంది అనే నిర్లక్ష్యం వీడి.. ఓటు వేయడాన్ని ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించాలి. మరెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి ఓటు వేసి రండి.
AP Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu News