Share News

Chandrababu: వందకు వెయ్యి శాతం.. కేంద్రంలో.. రాష్ట్రంలో ఎన్డీయేనే..!!

ABN , Publish Date - May 04 , 2024 | 06:07 PM

ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే గెలiపు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ నారా చంద్రబాబు నాయుడు పలు అసక్తికర అంశాలు తెలిపారు.

Chandrababu: వందకు వెయ్యి శాతం.. కేంద్రంలో.. రాష్ట్రంలో ఎన్డీయేనే..!!
Chandrababu

అమరావతి, మే 04: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే గెలుపని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు పలు అసక్తికర విషయాలు వెల్లడించారు. 2019కి ముందు ఎన్డీయే నుంచి ఎందుకు బయటకు వచ్చారని యాంకర్ ప్రశ్నించగా.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన సమయంలో పలు అంశాలు అమలు చేసినా.. రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా అయితే ఇవ్వలేదన్నారు.

AP Elections: ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!!

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని ఆయన అభివర్ణించారు. ఆ క్రమంలో వారితో విభేదించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అదే క్రమంలో ప్రతిపక్షనేతగా వైయస్ జగన్.. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందని చంద్రబాబు ప్రశ్నించారు.

AP Elections: ఈ ఎన్నికల్లో పవన్ కింగ్ మేకర్‌గా వ్యవహరిస్తారా ..?

కానీ నరేంద్ర మోదీతో పోల్చుతూ.. రాహుల్ గాంధీకి మద్దతు అయితే ఇవ్వలేదనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ క్రమంలో ప్రత్యేక హోదా కోసమే.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏతో విభేదించామని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు.


ఇక ప్రధాని మోదీ, చంద్రబాబు ఇద్దరు అభివృద్ధి కొరకే పని చేస్తారా? అంటే అవునని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకే మోదీతో కలిశారా? అంటే జగన్ ఏమిటి.. రాజకీయంగా చేసిందేంటి..? అని చంద్రబాబు నిలదీశారు. మోదీ బలమైన నాయకుడు అని మీరు భావిస్తున్నారా? అందుకే కేంద్రానికి మద్దతు ఇస్తున్నారా? ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తిరిగి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారా? అంటే అవునని చంద్రబాబు ఈ సందర్బంగా సమాధానం ఇచ్చారు.

Teachers Fighting: స్కూల్లో టీచర్, ప్రిన్సిపల్ డిష్యూం.. డిష్యూం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఒకరి కోసం ఒకరు పని చేసుకొనే విధంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆ క్రమంలో ప్రతీ విషయంలో అభివృద్ది జరగాలన్నారు. కేంద్రంలో మోదీ వచ్చి.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి వస్తే.. ఎన్డీఏ కూటమిలో మీరు భాగస్వాములవుతారా ? అని ప్రశ్నించగా.. ఒకానొక సమయంలో లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిందని చంద్రబాబు గుర్తు చేశారు.


అయితే ఎటువంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి పదవులు కోసం టీడీపీ బేరాలాడిన సందర్బాలు అయితే లేవన్నారు. ఇక తన ఎజెండా కేవలం అభివృద్ధి మాత్రమేనని.. అదీకూడా ఎప్పుడు ఆ అభివృద్ధినే ఆకాంక్షిస్తానని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్‌గా ఉందన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోదీనే వస్తారని.. ఇది 100 శాతం నిజమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించగా.. ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబును ప్రశ్నించగా.. ఆ సమయంలో కొన్ని సెంటిమెంట్లు చాలా బలంగా పని చేస్తాయన్నారు. అయితే ఎన్నికల్లో గెలుపు ఓటములు ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.

అదే సమయంలో మనం ఏమి చెప్పినా ప్రజలు సరిగ్గా అర్థం చేసుకునే పరిస్థితి ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ క్రమంలోనే గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యామన్నారు. భారత రాజకీయాల్లో సరికొత్త జోడి మోదీ, బాబు విజయం సాధిస్తారా? అని ప్రశ్నించగా.. కేంద్రంలో మోదీ, ఇక్కడ ఎన్డీఏ అంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అయితే ఇది వంద శాతమా అంటే.. వెయ్యి శాతమంటూ చంద్రబాబు చమత్కరించారు.

Read National News and Telugu News

Updated Date - May 04 , 2024 | 07:09 PM