Share News

Hyderabad: అడుగు బయట పెడితే అంతే.. అప్పటి వరకు వడగాల్పులు తప్పవు: ఐఎండీ

ABN , Publish Date - May 03 , 2024 | 09:06 AM

అసలే మే నెల. భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయే తెలిసిందే. మే నెల చివరి వారం వరకు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. అయితే కొన్ని రోజుల క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు(Heat Wave Alerts) జారీ చేసింది.

Hyderabad: అడుగు బయట పెడితే అంతే.. అప్పటి వరకు వడగాల్పులు తప్పవు: ఐఎండీ

హైదరాబాద్: అసలే మే నెల. భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయే తెలిసిందే. మే నెల చివరి వారం వరకు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. అయితే కొన్ని రోజుల క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు(Heat Wave Alerts) జారీ చేసింది.

తాజాగా హెచ్చరికను మే 6 వరకు పొడగిస్తూ ఐఎండీ(IMD) ప్రకటన జారీ చేసింది. అప్పటి వరకు అత్యవసరమైతే తప్ప పగటి పూట అడుగు బయటపెట్టొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మే2న నల్గొండలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


45 డిగ్రీలపైనే..

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) డేటా ప్రకారం.. చాలా జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, మహబూబాబాద్, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్, నిర్మల్, హనుమకొండలో నిన్న ఒక్క రోజే 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

హీట్ వేవ్ హెచ్చరిక ఉన్నన్ని రోజులు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా రికార్డవుతాయని ఐఎండీ తెలిపింది. నిన్న ఖైరతాబాద్‌, చార్మినార్‌ ప్రాంతంలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలో ప్రయాణించే వారు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Read Latest News and Telangana News here

Updated Date - May 03 , 2024 | 09:06 AM