Share News

Viral News: వామ్మో.. ఇది మామూలు కోతి కాదు.. దాని తెలివికి సైంటిస్టులు సైతం షాక్

ABN , Publish Date - May 04 , 2024 | 06:31 PM

కోతులు ఎంత అల్లరి చేస్తాయో, అంతే తెలివైనవి. కొన్ని విషయాలను అవి మనుషులను చూసి నేర్చుకుంటే, మరికొన్ని మాత్రం తామే స్వయంగా ఎన్నో పనులు చేసుకుంటాయి. తాజాగా ఓ కోతి చేసిన పని చూసి.. శాస్త్రవేత్తలు సైతం నివ్వెరపోయారు.

Viral News: వామ్మో.. ఇది మామూలు కోతి కాదు.. దాని తెలివికి సైంటిస్టులు సైతం షాక్

కోతులు (Monkeys) ఎంత అల్లరి చేస్తాయో, అంతే తెలివైనవి. కొన్ని విషయాలను అవి మనుషులను చూసి నేర్చుకుంటే, మరికొన్ని మాత్రం తామే స్వయంగా ఎన్నో పనులు చేసుకుంటాయి. తాజాగా ఓ కోతి చేసిన పని చూసి.. శాస్త్రవేత్తలు (Scientists) సైతం నివ్వెరపోయారు. దాని తెలివిని చూసి.. ముక్కున వేలేసుకున్నారు. ఆ కోతి సహకారంతో.. మానవుల ఆరోగ్య సమస్యల్ని దూరం చేసే అరుదైన ఆకులను కనుగొన్నారు. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం పదండి...


కుక్కలకూ ‘ఆధార్’.. దీని వెనకున్న కథేంటో తెలుసా?

ఆ కోతి పేరు రాకూస్. ఇది సుమత్రన్‌ ఒరంగుటాన్స్‌ అనే జాతికి చెందింది. ఇండోనేషియాలోని (Indonesia) నేషనల్‌ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్‌‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బిహేవియర్‌ సంస్థలకు చెందిన పరిశోధకులు.. గత కొన్ని రోజులుగా ఈ కోతిపై అధ్యయనం చేస్తున్నారు. ఇటీవల రాకూస్ మరో మగ కోతితో గొడవ పడింది. ఈ క్రమంలో దాని ముఖానికి తీవ్ర గాయమైంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. తనకైన ఆ గాయానికి రాకూస్ తనే వైద్యం చేసుకుంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ‘ఫైబ్రేరియా టింక్టోరియా’ అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో ఆ కోతి తానే స్వయంగా వైద్యం చేసుకోవడం చూసి.. సైంటిస్టులు ఫిదా అయ్యారు.

అదే ముంబై ఇండియన్స్ కొంపముంచింది

తొలుత ఒరంగుటాన్ (కోతి పేరు) ఆ ఆకులను బాగా నమిలి, వాటి పసరుని దవడ గాయంపై రాసుకుంది. అనంతరం నమిలిన ఆకుల్ని గాయంపై పెట్టుకుంది. ఆ తర్వాత అది గాయం మానేందుకు ఎక్కువసేపు నిద్రపోయిందని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఉన్న గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్‌లో ఈ దృశ్యాలను రికార్డ్ చేశారు. మానవుల్లో కాకుండా ఇతర జాతుల్లో ఇలాంటి ప్రవర్తన (తమకైన గాయానికి వైద్యం చేసుకోవడం) నమోదు చేయబడటం ఇదే మొదటిసారి. ఆ ఆకులను పరిశోధించగా.. వాటిల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని.. మలేరియా, విరేచనాలు, డయాబెటిస్‌ చికిత్సలో వాటిని వాడుతారని తేలింది.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 04 , 2024 | 06:31 PM