Share News

Crying Kids: పిల్లలు ప్రతిదానికి ఏడుస్తుంటారా? తల్లిదండ్రులు వెంటనే చెయ్యాల్సిన 5 పనులివీ..!

ABN , Publish Date - Jan 25 , 2024 | 05:24 PM

పిల్లల ఏడ్చే అలవాటు వారు క్రమంగా పెరిగేకొద్దీ తగ్గుతూ వస్తుంది. కానీ కొందరు పిల్లల విషయంలో మాత్రం ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది. దీనికి తల్లిదండ్రులు చేయాల్సిన పనులివీ..

Crying Kids: పిల్లలు ప్రతిదానికి ఏడుస్తుంటారా? తల్లిదండ్రులు వెంటనే చెయ్యాల్సిన 5 పనులివీ..!

చిన్నపిల్లలు ఏడవడం సహజం. పిల్లలు చాలా కారణాల వల్ల ఏడుస్తారు. వారు అడిగింది తీసివ్వకపోయినా, వారు అనుకున్నది జరగకపోయినా, తల్లిదండ్రులు, పెద్దలు మందలించినా తరచుగా ఏడుస్తుంటారు. ఈ అలవాటు వారు క్రమంగా పెరిగేకొద్దీ తగ్గుతూ వస్తుంది. కానీ కొందరు పిల్లల విషయంలో మాత్రం ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కేవలం వారు అడిగింది తీసివ్వలేదనో, తల్లిదండ్రులు మందలించారనో కాకుండా ప్రతి విషయానికీ ఏడుస్తున్నా, చిన్న సమస్యలకు కూడా బెంబేలు పడుతున్నా దాన్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల ఏడుపు తగ్గించడానికి తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..

ఏడవడం గురించి వివరించాలి..

ప్రతిదానికి ఏడవడం అసలైన పరిష్కారం కాదనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడటం, ఏడవటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని తెలపాలి. పిల్లలు వెలిబుచ్చే విషయాలను అర్థం చేసుకోవాలి. వారి ,సందేహాలకు సరైన సమాధానాలు ఇవ్వాలి. ఇలా చేస్తే ఏడవడం అనవసరమైన చర్య అని పిల్లలు అర్థం చేసుకుంటారు.

ఇది కూడా చదవండి: అల్పాహారంలో ఇవి తీసుకుంటే చాలు.. రోజంతా రేసుగుర్రం లెక్క చురుగ్గా ఉంటారు!


ఎదుర్కోవడం నేర్పాలి..

ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వగానే ఏడవడానికి పిల్లలను ప్రోత్సహించకూడదు. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వారికి నేర్పించాలి. పిల్లలకు ఈ విషయాలను నేర్పించడం ఒక కళ అని చెప్పవచ్చు. కానీ తల్లిదండ్రులు ప్రయత్నిస్తే పిల్లలు పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకుంటారు. సమస్య వచ్చినప్పుడు ఏడవడానికి బదులు పరిష్కారం దిశగా ఆలోచిస్తారు.

సపోర్ట్ ఇవ్వాలి..

పిల్లలు తప్పు చేసినా మంచి చేసినా పెద్దల సపోర్ట్ అయితే ఉండాలి. కానీ మంచి చేసినప్పుడు మెచ్చుకోవడం, తప్పు చేసినప్పుడు అది ఎందుకు తప్పో తెలియజెప్పి మరొక్క సారి అలా చేయకూడదనని చెప్పడం ముఖ్యం. అలాగే ఆహారం, వ్యాయామం,వారి జీవనశైలి విషయంలో తల్లిదండ్రులే పిల్లలను ముందుకు నడిపించాలి.

సానుభూతి..

పిల్లలు బాధలో ఉన్నప్పుడు వారిని ఊరడించడానికి బదులుగా తిట్టినా, కోప్పడినా వారు ఇంకా ఎక్కువ బాధపడతారు. ఆ వయసులో పిల్లలకు కావాల్సింది సానుభూతి. ఓదార్చి, ధైర్యం చెబితే తొందరగా ఏడుపు మానతారు.

ఆత్మవిశ్వాసం..

ఏడవడం వ్యర్థమని, సమస్యలను ఎదుర్కోవాలని, ఎప్పుడూ ధైర్యంతో ఉండాలని తల్లిదండ్రులు చెబితే పిల్లలు ధైర్యంగా ఉంటారు. తమ వెన్నంటి తల్లిదండ్రులు ఉంటున్నారనే దైర్యంతో సమస్యలను తామే పరిష్కరించే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తారు.

ఇది కూడా చదవండి: 100Years Life: జపాన్ ప్రజల సీక్రెట్ ఇదే.. ఈ 5 ఆహారాలతో ఏకంగా 100ఏళ్ల ఆయుష్షు ఖచ్చితమట..!


మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 25 , 2024 | 05:24 PM