Share News

Viral Video: ఏనుగు తొండాన్ని పట్టుకున్న మొసలి.. చివరకు ఎలా తప్పించుకుందో చూస్తే..

ABN , Publish Date - May 17 , 2024 | 02:30 PM

నీళ్లలో ఉన్న మొసలికి ఎంత శక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద జంతువైనా ఒక్కసారి దాని నోట పడిందంటే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే...

Viral Video: ఏనుగు తొండాన్ని పట్టుకున్న మొసలి.. చివరకు ఎలా తప్పించుకుందో చూస్తే..

నీళ్లలో ఉన్న మొసలికి ఎంత శక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద జంతువైనా ఒక్కసారి దాని నోట పడిందంటే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే కొన్నిసార్లు ఇందుకు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మొసలి దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. నీరు తాగుతున్న ఓ ఏనుగుపై మొసలి దాడి చేసింది. ఏనుగు తొండాన్ని పట్టుకోవడంతో చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జింబాబ్వేలోని (zimbabwe) జాంబేజీ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని ఏనుగులు నీళ్లు తాగడానికి ఓ నది వద్దకు వెళ్తాయి. నది ఒడ్డున నిలబడిన ఏనుగులు.. వరుసగా నీళ్లు తాగుతుంటాయి. అయితే అప్పటికే ఓ మొసలి నీటి అడుగున పొంచి ఉంటుంది. దీన్ని గమనించిన ఏనుగులు అప్రమత్తమవుతాయి. దాని బారిన పడకుండా చాకచక్యంగా తప్పించుకుంటుంటాయి.

Puzzle: మీలోని ఏకాగ్రతకు ఇదో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..


అయితే ఈ క్రమంలో వాటిలో ఓ ఏనుగు నదిలో కాస్త లోతుగా వెళ్లి తాగుతుంటుంది. అప్పటికే అక్కడ పొంచి ఉన్న మొసలి.. ఏనుగు తొండాన్ని (Crocodile attack on elephant) పట్టుకుని లోపలికి లాగుతుంది. తొండాన్ని పట్టుకోగానే ఏనుగు విలవిల్లాడుతుంది. అయినా వెంటనే తేరుకుని మొసలి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఏకంగా మొసలినే ఒడ్డుకు లాక్కొస్తుంది. ఒడ్డుకు లాక్కొచ్చిన తర్వాత తొండంతో గట్టిగా విదిలించడంతో మొసలి ఏనుగును వదిలేస్తుంది. తర్వాత ఏనుగులన్నీ అక్కడి నుంచీ తప్పించుకుని వెళ్లిపోతాయి.

Viral Video: రోటీన్‌కు భిన్నంగా వరుడు.. వధువు దండ వేస్తున్న సమయంలో..


ఆ తర్వాత రాత్రి వేళ కూడా మొసలి వాటిపై దాడి చేయాలని చూస్తుంది. అయినా ఏనుగుల పవర్ ముందు అది సాధ్యం కాదు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగా మజాకా’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్కూటీపై వచ్చిన మహిళను చూసి హడలెత్తిన ఏనుగు.. సమీపానికి రాగానే అది చేసిన నిర్వాకం..

Updated Date - May 17 , 2024 | 02:30 PM