Share News

Viral video: చిన్నారిని చూసి ఆనంద్ మహీంద్రా ఫిదా.. అందరిలో ఇలాంటి సంస్కారం ఉంటే..

ABN , Publish Date - May 04 , 2024 | 04:54 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. అనారోగ్యానికి గురై వీల్‌చైర్‌కి పరిమితమైన ఓ వ్యక్తి.. రోడ్డు దాటాల్సి వస్తుంది. అతడికి సాయం చేయడానికి కూతురు కూడా వస్తుంది. అయితే..

Viral video: చిన్నారిని చూసి ఆనంద్ మహీంద్రా ఫిదా.. అందరిలో ఇలాంటి సంస్కారం ఉంటే..

పిల్లల భవిష్యత్ వారి పెంపంకంపైనే ఆధారపడి ఉంటుంది. పెద్దల నుంచి పిల్లలు అనేక విషయాలను నేర్చుకుంటుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే సంస్కృతి, సంప్రదాయాలు, మంచి, చెడు తదితర విషయాలపై అవగాహన కల్పించాలి. అప్పుడే వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటూ, అత్యున్నతమైన సంస్కారాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ చిన్నారి వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై తండ్రిని వీల్ చైర్‌లో తోసుకెళ్తున్న చిన్నారిని చూసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైలర్ అవుతోంది. అనారోగ్యానికి గురై వీల్‌చైర్‌కి పరిమితమైన ఓ వ్యక్తి.. రోడ్డు దాటాల్సి వస్తుంది. అతడికి సాయం చేయడానికి కూతురు కూడా వస్తుంది. అయితే వాహనాలు రద్దీగా తిరుగుతుండడంతో అది సాధ్యం కాదు. జీబ్రా లైన్స్ వద్దకు చేరుకున్న వారిని చూసి వాహనలన్నీ ఆగిపోతాయి. దీంతో చిన్నారి (little girl) వీల్‌చైర్‌ను తోసుకుంటూ వెళ్తుంది. అయితే ఇక్కడే ఆ చిన్నారిలోని సంస్కారం బయటపడుతుంది. తాము రోడ్డు దాటడానికి సహకరించిన వాహనదారులందరికీ ఆమె ముందుకు వంగి మరీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇలా ఒకసారి కాకుండా.. రెండు, మూడు అడుగుల మేర వీలై‌చైర్‌ను తోస్తూ, వాహనదారులను ధన్యవాదాలు తెలియజేస్తూ వెళ్తుంది.

Viral Video: పాము కాటుతో చనిపోవడంతో.. నీటిలో వేలాడదీశారు.. చివరికి రెండు రోజుల తర్వాత..


రోడ్డు దాటే వరకూ ఇలాగే చేస్తూ వెళ్తుంది. ఆ చిన్నారి సంస్కారానికి వాహనదారులంతా ఫిదా అవుతారు. కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా ఫిదా అయ్యాడు. వెంటనే ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ప్రపంచం మొత్తం ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందీ.. అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చిన్నారిని చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇంత చిన్న వయసులోనే ఎంత సంస్కారం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: పక్కనే ఉండి షాక్ ఇచ్చిన వధువు.. మొఖం చూడాలని వరుడు ముసుగు తీయడంతో.. చివరకు..

Updated Date - May 04 , 2024 | 04:54 PM